కుప్పకూలిన సీఎం హెలీకాప్టర్ 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కుప్పకూలిన సీఎం హెలీకాప్టర్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లాతూర్ వద్దకు చేరుకోగానే కూలిపోయినట్టు స్వయంగా దేవేంద్ర ఫడ్నవిస్ ట్విటర్లో పోస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు స్వయంగా ఫోన్ చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. హెలికాప్టర్‌ను అత్యవసరంగా దించివేసిన ఘటనపై ఫడ్నవిస్ సీఎం కేసీఆర్‌కు వివరించారు. హెలికాప్టర్ ప్రమాదం నుంచి ఫడ్నవిస్ సురక్షితంగా బయటపడటం పల్ల సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఫైలట్లు సమయస్పూర్తితో వ్యవహరించి ప్రమాదం జరుగకుండా చూసిన తీరును సీఎం కేసీఆర్ అభినందించారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో సీఎం ఫడ్నవిస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను ఫైలట్లు లాతూర్ సమీపంలో అత్యవసరంగా దింపిన విషయం తెలిసిందే.

(313)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ