WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఒక్కరు వస్తేనే ప్రకంపనలు

*అదే ముగ్గురు వస్తే మూర్చపోతారు

*దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నాటకాలు ఆడింది ఎవరు?

*మీరే అమిత్‌ షాకు క్షమాపణ చెప్పాలి

*ఆయన  మీద ఆయనకే  నమ్మకం లేదు

*ఉంటే పార్టీ ఫిరాయించిన

ఎంఎల్ఏ రాజీనామా చేయించండి

 *మూడేళ్ల మీ పాలన సత్తా నిరుపించుకోండి

*ముఖ్యమంత్రి కెసిఆర్ కు లక్ష్మణ్‌ సవాల్

అమిత్‌షా ఒక్కరు వస్తేనే టీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయని భాజపా నేత లక్ష్మణ్‌ అన్నారు. అదే ముగ్గురు వస్తే మూర్చపోతారని ఎద్దేవా చేశారు. భాజపాకు వచ్చిన స్పందన చూసి టీఆర్‌ఎస్‌ ఆందోళన చెందుతోందని అన్నారు. రాష్ట్ర పర్యటనలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా చెప్పిన విషయాలన్నీ అబద్దమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్‌ స్పందించారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన అమిత్‌ షాను తప్పుబట్టే స్ధాయికి మీరు ఎదిగిపోయారా? అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.
  కేంద్రం నిధులు.. పథకాలు ప్రజలకు చేరటం లేదని అమిత్‌షా అంటే కేసీఆర్‌ వాడిన పదజాలంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సెప్టెంబర్‌లో అమిత్‌షా ఆరురోజుల పాటు పర్యటిస్తారని తెలిపారు. రూపాయికి కిలో బియ్యం పథకంలో కేంద్రం రూ.27 చెల్లిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.2 మాత్రమే చెల్లిస్తూ కేంద్రాన్ని ఎద్దేవా చేస్తున్నారని అన్నారు. కేంద్ర 90వేల ఇళ్లనుకేటాయిస్తేరాష్ట్రప్రభుత్వంపూర్తిగావినియోగించుకోలేకపోయిందన్నారు. కేంద్రం ఆసుపత్రులకు రూ.1000 కోట్లు ఇస్తే రాష్ట్రం వాటా రూ.250 కోట్లు ఇవ్వలేకపోయారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆరే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలంటూ ప్రజలను తప్పుబట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి ప్రతి పథకానికి వస్తున్న నిధులను, గ్రాంట్లను దారి మళ్లించి ప్రజల సొమ్మును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోచుకుంటోందని అన్నారు. సీఎం తనకు తానో తానీషాలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.కేంద్రం అందజేస్తున్న నిధులు పేద ప్రజలకు చేరడం లేదనే అమిత్‌ షా పెర్కొన్నరన్నారు. ఎర్రటి ఎండలో ప్రజలను కలిసేందుకు అమిత్‌ షా వెళ్లారని.. సీఎం మాత్రం ప్రగతి భవన్‌లో ఏసీ వేసుకుని కూర్చున్నారని విమర్శించారు. అమిత్‌ షా మీకు సారీ చెప్పడం కాదు.. మీరే అమిత్‌ షాకు క్షమాపణ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేసారు.- గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి యకుండా కేసీఆర్‌ మహిళలను అవమానాల పాలు చేస్తున్నారు. వారి త్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. కేసీఆర్‌ వారందరికీ క్షమాపణలు చెప్పాలన్నారు.సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌లో భాగంగా అన్ని వర్గాల ప్రజల్లో మభావన పెంపొందించేందుకు అమిత్‌ షా సహపంక్తి భోజనం చేస్తే దాని మీద బురదజల్లాలని చూడటం దురదృష్టకరమన్నారు. ఎక్కడో వండిన భోజనాన్ని సహపంక్తి భోజనంగా అమిత్‌ షా తిన్నారనడం బాధాకరం.
     దళిత వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నాటకాలు ఆడింది మీరు. కంటి తుడుపుగా డిప్యూటీ సీఎం పదవిని దళితుడికి ఇచ్చి అవినీతి ఆరోపణలపై ఎలాంటి విచారణ లేకుండా తప్పించడం మీరు చేసిన కుట్రే అని లక్ష్మణ్ తీవ్రస్తాఎలో ధ్వజమెత్తారు. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలీడం లేదు. అమిత్‌ షా తెలంగాణకు రాక టీఆర్‌ఎస్‌ పీఠంలో కుదుపులు తీసుకొచ్చిందన్నారు. కన్‌ఫ్యూజన్‌లో బీజేపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారని సీఎం అన్నారు. మీ మీద మీకు అంత నమ్మకం ఉంటే పార్టీ ఫిరాయించిన 30 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మూడేళ్ల మీ పాలన సత్తా నిరుపించుకోండి. మీ బలం ఎంటో మీ పరిపాలన ఏంటో చూద్దామని లక్ష్మణ్ సవాల్ విసిరారు.ఈ సమావేశంలో పార్టీ శాసన సభ్యులు జి.కిషన్ రెడ్డి,ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ,రాజ సింగ్,చింతల రామచంద్ర రెడ్డి,ఎంఎల్సి ఎన్.రామచంద్ర రావు లతో పాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గూన్నారు.

(213)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ