WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అవినీతి, కుంభకోణాలఫై మోదీ అసత్య ప్రచారం

అవినీతి, కుంభకోణాలు లేని పాలన అంటూ మోదీ అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ విమర్శించారు.శుక్రవారం ఎక్కడ మీడియా తో మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో కుంభకోణాలు ఆయనకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.. ‘పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో ఎంతమొత్తం జమ అయిందో ఇంతవరకు ప్రకటించలేదు. మూడేళ్ల పాలనను మోదీ పాలనగానే చెబుతున్నారు తప్ప.. ఎన్డీయే పాలనగా చెప్పట్లేదు. యూపీలో మొదలుపెట్టిన ప్రాజెక్టులనే మోదీ ప్రారంభిస్తున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో తలెత్తిన కరవును కేంద్రం పట్టించుకోవడం లేదు. విపక్షంలో ఉన్న సమయంలో ఉపాధి హామీ పథకం, ఆధార్‌ను మోదీ విమర్శించారు. రైతులకు బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఒక్క కార్పోరేట్‌ రంగంలో మాత్రమే జీడీపీ పెరిగింది. 2015లోనే 12వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధాని ఫసల్‌ బీమా యోజన ద్వారా ప్రైవేటు కంపెనీలకు రూ.21వేల కోట్లు లాభం చేకూరింది. ప్రజల లావాదేవీలపై పన్ను వేస్తే గానీ నడవలేని స్థితికి అ పెద్ద బ్యాంకు చేరింది’ అని మొయిలీ విమర్శించారు. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటుందని  ఆయన పేర్కొన్నారు.

(318)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ