WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప‌శువ‌ధ‌పై కేంద్రం నిషేధం

 ప‌శువ‌ధ‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. వాటి అమ్మ‌కాల‌పై కూడా కొన్ని నియంత్ర‌ణ‌లు విధించింది. ఈ మేర‌కు ఆ శాఖ ఓ గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం ప‌శువుల‌ను కేవ‌లం వ్య‌వ‌సాయ ప‌నుల నిమిత్త‌మే అమ్మడానికి తీసుకొచ్చామ‌ని, వాటిని ప‌శువ‌ధశాల‌ల‌కు అమ్మ‌డం లేద‌ని రైతులు లిఖిత‌పూర్వ‌కంగా రాసిస్తేనే వాటిని ప‌శువుల మార్కెట్‌లో అమ్మ‌కానికి అనుమ‌తినిస్తారు. దీనిని ప‌శువుల మార్కెట్ క‌మిటీ ఆమోదించాల్సి ఉంటుంది. ఇక స‌ద‌రు ప‌శువుల‌ను కొనుగోలు చేసేది కూడా ఒక రైతేన‌ని అత‌ని ద‌గ్గ‌ర ఉండే ప‌త్రాల‌ను చూసి అధికారులు ధృవీక‌రిస్తారు. 

 ఇక కొనుగోలుదారు వాటిని ప‌శువ‌ధ‌శాల‌కు అమ్మ‌బోన‌ని లేదా వాటిని ఏ మ‌త విశ్వాసాల‌కు అనుగుణంగా బ‌లి ఇవ్వ‌బోన‌న్న హామీ ఇవ్వాల్సి ఉంటుంద‌ని కూడా ఈ గెజిట్నోటిఫికేష‌న్స్ప‌ష్టంచేసింది.ఇక్క‌డ పశువులు అంటే ఎద్దులు, ఆవులు, బ‌ర్రెలు, ఒంటెలు, దూడ‌లు, కోడెలు అని నోటిఫికేష‌న్ స్పష్టంచేసింది. ఇక పక్క రాష్ట్ర వ్య‌క్తి అనుమ‌తి లేకుండా ప‌శువుల‌ను కొనుగోలు చేయ‌డంపై కూడా నిషేధం విధించింది ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌. రాష్ట్ర స‌రిహ‌ద్దుల‌కు 25 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ప‌శువుల మార్కెట్లు ఉండ‌కూడ‌ద‌ని కూడా ఆదేశించింది. ఇక గోశాల‌లు, ఇత‌ర ప‌శుసంర‌క్ష‌ణ శాల‌లు త‌మ ద‌గ్గ‌ర ఉన్న ప‌శువుల‌ను ద‌త్త‌త‌కు ఇచ్చే ముందు కూడా వాటిని ప‌శువ‌ధ‌శాల‌ల‌కు అమ్మ‌డం లేద‌ని రాసివ్వాల్సి ఉంటుంది. అయితే ఇది రాష్ట్రాల‌కు సంబంధించిన అంశం కావ‌డంతో ప‌శువ‌ధ‌ను కేంద్రం ఎలా నిర్మూలిస్తుంద‌న్నదానిపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

(121)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ