WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పశ్చిమ'లో 'బాబు' గాలి...!

పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన రహస్యసర్వేలో 57శాతం మంది ఓటర్లు ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తుండగా 30శాతం మంది ఫర్వాలేదన్నారని, 13శాతం పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని వెల్లడైంది. జిల్లాలో అధికార అవినీతిని అదుపు చేయటంలో కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌తో పాటు ఇతర అధికారులు కఠినంగా వ్యవహరించడంతో ప్రభుత్వానికి 57శాతం మద్దతు లభించిందని ఆ సర్వేలో వెల్లడైంది. నిజాయితీలో కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ కోటేశ్వరరావులు ప్రథమ స్థానంలో ఉండగా జిల్లాస్థాయి అధికారులు కూడా అతి కొద్ది మందిపై మాత్రమే ఆరోపణలు ఉన్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. 13శాతం వ్యతిరేకిస్తున్న ప్రజలు స్థానిక సంస్థల ప్రతినిధులతో పాటు, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని, వారి వ్యతిరేకత టిడిపి ప్రభుత్వంపై కాదని తేలింది. 

  రాజకీయ అవినీతిని పోషించడంలో ముగ్గురు ఎమ్మెల్యేలు మినహా మిగతా వారందరూ బాగా వెనకేసుకున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. జిల్లాలో అవినీతికి పాల్పడాలంటే చాలా మంది అధికారులు వణికిపోతున్నారు. పట్టిసీమ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయటంలో కలెక్టర్‌ భాస్కర్‌ రాత్రింభవళ్లు చేసిన కృషిని అనేక సందర్బాల్లో ముఖ్యమంత్రి కొనియాడారే తప్ప ప్రజాప్రతినిధులెవరినీ ప్రశంశించకపోవడం విశేషం. 13జిల్లాలో పశ్చిమగోదావరి జిల్లాలోనే పార్టీ బలంగా ఉండడానికి కారణం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలను మారుమూల గ్రామాల ప్రజలకు అందజేయటంలో అధికారయంత్రాంగం చేసిన కృషే కారణం. 

  ఇటీవల కొందరు ముఖ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరు ఇతర అధికారుల వంటి వారు ఇతర జిల్లాల్లో పనిచేస్తే ఇదే రకమైన ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా వస్తాయని చెప్పారు. 13శాతం ఓటర్లు ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేయటం లేదని తెలుసుకున్న చంద్రబాబు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అధికారాలను తగ్గించి, వ్యతిరేకిస్తున్నవారిని అనుకూలంగా మార్చుకునేందుకు మార్గాలు వెతుకుతున్నారు. ప్రభుత్వ పనితీరు ఫర్వాలేదన్న 30శాతం మంది ఓటర్లను ఏ విధంగా సంతృప్తి పరచాలనే విషయంపై చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా అధికారయంత్రాంగం పనితీరును బట్టి ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేస్తారని పశ్చిమగోదావరి జిల్లా అధికారులు నిరూపించారని, వీరి వలే మిగతా వారు కూడా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు.

(348)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ