WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

హిందూపూర్‌లో 'బాలయ్య' అవుట్‌...!

దివంగత ఎన్టీరామారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్‌ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో ఆయన సినీ వారసుడు నందమూరి బాలకృష్ణ విజయం సాధించినప్పటికీ తండ్రికి వచ్చిన మెజార్టీ తనయునికి రాకపోవడం విశేషం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా హిందూపూర్‌ టిడిపి అభ్యర్థి మళ్లీ బాలకృష్ణ అయితే వేల మెజార్టీతో ఓడిపోవడం ఖాయమట. బాలయ్య మినహా పార్టీకి చెందిన ఏ ఒక్కరికీ పోటీ చేసే అవకాశం ఇస్తే అవలీలగా విజయం సాధించడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజా సమస్యల ను పరిష్కరిస్తారనుకుంటే సినిమాలకే పరిమితం కావడం, నియోజకవర్గానికి మొహం చూపకపోవడం వంటి కారణాలు బాలయ్యపై ఓటర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. 

  సినిమాలు ముఖ్యమా...? రాజకీయాలు ముఖ్యమా...? ఏదోటి తేల్చుకుంటే తప్ప 'బాలయ్య'కు రాజకీయ మనుగుడ ఈ నియోజకవర్గంలో ఉండదు. అందుకేనేమో తాను...కృష్ణా జిల్లా నుండి పోటీ చేసే అవకాశం లేకపోలేదని కొన్ని సందర్భాల్లో 'బాలయ్య' నర్మగర్భంగా చెబుతున్నారు. 1983 నుండి 2014 వరకు టిడిపి కంచుకోటగా ముద్రపడిన 'హిందూపూర్‌' నియోజకవర్గంలో తాజాగా ఎమ్మెల్యే బాలకృష్ణపై ఓటర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు తప్ప....టిడిపి ప్రభుత్వంపై కాదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గం నుండి స్థానికులను ఎన్నికల బరిలోకి దించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా భావిస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గ ఓటర్లల్లో ఎక్కువ మంది కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారే తప్ప ఏ నాడు టిడిపి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేయకపోవడం విశేషం. 

  దాన్ని అనుకూలంగా మలచుకుని తండ్రికి వచ్చిన మెజార్టీనీ తనకు వచ్చే విధంగా బాలకృష్ణ వ్యవహరించకుండా సినీ రంగానికే పరిమితమయి చేతులు కాల్చుకుని వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు. మళ్లీ అక్కడ నుండి పోటీ చేస్తే ఓటమితప్పదనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని పలువురు ఎమ్మెల్యేలతో పాటు సీనియర్‌ నాయకులు అనేక సందర్భాల్లో అభప్రాయాన్ని వ్యక్తం చేయటమే కాకుండా 'బాలయ్య' ఇక్కడ నుండి తప్పుకుంటేనే మంచిదని తన మనోభిష్టాలను తెలియచేస్తున్నారు. 

(369)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ