నిర్మాణాత్మకమైన విమర్శలే ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తాయి 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నిర్మాణాత్మకమైన విమర్శలే ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తాయి

దేశంలోని ముస్లింలకు రంజాన్‌ మాసం ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశంలో అన్ని విశ్వాసాల ప్రజలు ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నానని అన్నారు. నిర్మాణాత్మకమైన విమర్శలే మన ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తాయి.. అంటూ మనసులో మాట కార్యక్రమం ద్వారా పలు విషయాల గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమం వల్ల ‘దేశంలోని ప్రతీ కుటుంబంలో నేను ఓ సభ్యుడినయ్యాను’ అని మోదీ అన్నారు.స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు, రచయిత అయిన వీర్‌ సావర్కార్‌ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.. ఆయన జైలు జీవితంలో కూడా ఎన్నో రచనలు చేసిన గొప్ప వ్యక్తి అంటూ కొనియాడారు. స్వాతంత్య్ర పోరాటంలో సావర్కర్‌ పాత్ర మరిచిపోలేనిది అని అన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించిన కొన్ని విశేషాలు..

నేటి తరం యువత మనకు స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఎందరో సమరయోధుల చరిత్ర గురించి, వారి త్యాగాల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. యోగా మనసుకు ఎంతో హాయిని, శారీరక ధృడత్వాన్ని ఇస్తుంది. మూడో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మూడు తరాల వారు యోగా చేస్తున్న ఫొటోలు నాకు పంపించండని పేర్కొన్నారు.ముంబయిలోని వెర్సోవా బీచ్‌ను శుభ్రం చేసేందుకు విశేషకృషి చేస్తున్న ఆఫ్రజ్‌ షా, ఆయన బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.మన్‌ కీ బాత్‌ కార్యక్రమంపై యూఏఈకి చెందిన కళాకారుడు అక్బర్‌ సాహెబ్‌ పుస్తకాన్ని తయారు చేశారు. మరో గొప్ప విషయం ఏంటంటే ఆ పుస్తకాన్ని రూపొందించేందుకు ఆయన ఎటువంటి డబ్బులు తీసుకోలేదు. ఆ పుస్తకం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. రాష్ట్రపతి భవన్‌లో ఈ పుస్తకావిష్కరణ జరిగిందని, మూడేళ్ల ఎన్డీయే ప్రభుత్వం గురించి ప్రజలు తమ అభిప్రాయాలను మాకు తెలియజేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దీన్ని నేను స్వాగతిస్తున్నానన్నారు. ఈ వర్షాకాల సమయంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టండని మోడీ పిలుపునిచ్చారు.మన్‌ కీ బాత్‌ కార్యక్రమం నన్ను ప్రతి భారతీయుడితో కలుపుతోంది, ఇదొక ప్రత్యేకమైందని అన్నారు.జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ‘కనెక్టింగ్‌ పీపుల్‌ టు నేచర్‌’ థీమ్‌తో కార్యక్రమాలను నిర్వహిస్తోన్నట్లు తెలిపారు.పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే.. భవిష్యత్‌ తరాలకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది.

(247)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ