WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వెన్నుపోటుతోనే ఎన్టీఆర్ మరణించారు: లక్ష్మీపార్వతి

ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాజకీయ వెన్నుపోటుతోనే ఎన్టీఆర్ మరణించారన్నారు. ఎన్టీఆర్ హయాంలో నిర్వహించే ప్రతి మహానాడు పేదవాళ్ళకి ఉపయోగపడేదనిఇపుడు అ పరిస్థితి కనిపించడం లేదని ఆమె విమర్శించారు. పేదల పార్టీగా చెప్పుకునే టీడీపీ.. ఇప్పుడు పెద్దల పార్టీగా మారిపోయిందని ఆరోపించారు.పార్టీ ఫిరాయింపులను ఎన్టీఆర్ ముందు నుంచే వ్యతిరేకించారనిఅలాంటిది ఇప్పుడు చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని లక్ష్మీపార్వతి చెప్పారు. ఏపీలో ఎన్టీఆర్ ఆశయాలు అన్ని పక్కకి వెళ్లిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు చంద్రబాబుకి మహానాడు నిర్వహించే అధికారంగానీఅర్హతగానీ లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం హత్యారాజకీయాలు ప్రోత్సహిస్తోందనిఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత కూడా లేదని ఆమె పేర్కొన్నారు.

(289)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ