WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కేసీఆర్‌లో వెన్నులో వణుకు

తెలంగాణలో టీడీపీ గేర్ మార్చబోతోందని టీ టీడీపీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. విశాఖలో జరుగుతున్న మహానాడుకు విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాటాలతో ప్రజల్లోకి వెళతామన్నారు. మహానాడు స్ఫూర్తితో మరింత ముందుకెళతామని రేవంత్‌రెడ్డి అన్నారు. కాగా... కేసీఆర్ నిర్వహించిన సర్వేలో కేసీఆర్‌హరీశ్‌రావు‌కేటీఆర్‌కే మొదటి మూడు స్థానాలు ఎలా వచ్చాయి అంటూ ఆయన పేర్కొన్నారు. 

   తెలంగాణ మహానాడులో చంద్రబాబునాయుడు ప్రసంగాన్ని అడ్డుకునేందుకే సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశం పెట్టారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ మహానాడుకు వచ్చిన ప్రజాస్పందన చూసి కేసీఆర్‌లో వెన్నులో వణుకు పుట్టిందన్నారు. అంతేగాక మహానాడులో చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకునే ఉద్దేశంలో భాగంగా అప్పటికప్పుడు కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు ప్రసంగం లైవ్ కవరేజీ కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అలాగే ప్రజావ్యతిరేకతను తట్టుకోలేకే కేసీఆర్‌ సర్వేలు నిర్వహిస్తున్నారనిసర్వే పేరుతో కేసీఆర్‌ ప్రజలను మభ్యపెడుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. కార్యకర్తలు స్థైర్యం కోల్పోకుండా ఉండేందుకే టీఆర్‌ఎస్‌కు 111 సీట్లు వస్తాయని కేసీఆర్‌ చెప్తున్నారనిపోరుబాటలురైతులకు బేడీలుధర్నాచౌక్‌ ఆందోళనలతో కేసీఆర్‌ ఉక్కిరి బిక్కిరయ్యారని రేవంత్ అన్నారు.

(145)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ