WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రముఖ దర్శకుడు దాసరి కన్ను మూత

మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ సినీ నటుడు దాసరి నారాయణ రావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వారం క్రితం ఆయన రెండోసారి కిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.బీపీలో హెచ్చుతగ్గులు, అన్నావాహికకు రంద్రాలు, దాని వల్ల ఇన్‌ఫెక్షన్ సోకడం తదితరాల వల్ల ఆరోగ్యం బాగా లేదని తెలుస్తోంది. దీనిని డాక్టర్లు నిర్ధారించాల్సి ఉంది.ఈ ఏడాది జనవరి 19న మొదటిసారి ఆసుపత్రిలో చేరారు. మార్చి 29న డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఒకింత ఉత్సాహంగానే కనిపించారు. మళ్లీ ఈ నెల 17న రెండోసారి ఆసుపత్రిలో చేరారు.

మూడ్రోజుల క్రితం సర్జరీ

మూడు రోజుల క్రితం దాసరికి మరోసారి సర్జరీ జరిగింది. ఇన్‌ఫెక్షన్ సోకిందని, దీంతో ఆందోళనకర పరిస్థితి ఉందని సమాచారం. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటుతో ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.

5 నెలల్లో రెండుసార్లు..

గడిచిన అయిదు నెలల్లో దాసరి నారాయణ రావుకు రెండుసార్లు చికిత్స జరిగింది. తొలిసారి జనవరి 19న ఆసుపత్రిలో చేరారు. అప్పుడు చికిత్స అనంతరం మార్చి 29వ తేదీన ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయనకు అప్పుడు గ్యాస్ట్రిక్ బెలూన్ సర్జరీ చేశారు.

ఇటీవలే 75వ పుట్టిన రోజు

ఆ తర్వాత ఈ నెల 4వ తేదీన తన 75వ పుట్టిన రోజును జరుపుకున్నారు. అంతలోనే వారం క్రితం మరోసారి పరిస్థితి బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. మూడ్రోజుల క్రితం మరోసారి సర్జరీ చేశారని తెలుస్తోంది.

నటులు, దర్శకులు

దాసరి నారాయణ రావు ప్రముఖ దర్శకులు, నటులు. ఆయన యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత కొద్దికాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు

(345)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ