WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఏటీఎం నుంచి డ‌బ్బు విత్‌డ్రా చేస్తే..రంగుపడుద్ది

స‌్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గురువారం (జూన్ 1) నుంచి విత్‌డ్రావ‌ల్స్‌, క్యాష్‌, ఆన్‌లైన్ ట్రాన్స‌క్ష‌న్ల‌పై కొత్త సర్వీస్ చార్జీల‌ను తీసుకొచ్చింది. త‌మ మొబైల్ వాలెట్ యాప్ ఎస్‌బీఐ మొబైల్ బ‌డ్డీ ద్వారా ఏటీఎం నుంచి డ‌బ్బు విత్‌డ్రా చేస్తే.. ఒక్కో ట్రాన్స‌క్ష‌న్‌కు రూ.25 వ‌సూలు చేయ‌నుంది. ఈ యాప్ ద్వారా కార్డు లేకున్నా.. ఏటీఎం నుంచి డ‌బ్బు విత్‌డ్రా చేసే అవ‌కాశం ఉంటుంది. ఇక బేసిక్ సేవింగ్స్ బ్యాంక్స్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్‌బీడీఏ)ల‌కు బ్రాంచుల ద్వారా అయినా, ఏటీఎంల ద్వారా అయినా నెల‌కు నాలుగు మాత్ర‌మే ఉచిత ట్రాన్స‌క్ష‌న్లు ఉంటాయి. నాలుగు దాటితే చార్జీ వ‌సూలు చేస్తారు. ఈ బీఎస్‌బీడీఏ అకౌంట్ హోల్డ‌ర్ల‌కు జీరో బ్యాలెన్స్‌తో క‌నీస అవ‌స‌రాలైన ఏటీఎం కార్డు, నెల‌వారీస్టేట్‌మెంట్‌,చెక్బుక్ఇస్తారు. ఇక రెగ్యుల‌ర్ సేవింగ్స్ అకౌంట్ హోల్డ‌ర్లకు మాత్రం మెట్రో సిటీల్లో 8 ట్రాన్స‌క్ష‌న్లు (5 ఎస్‌బీఐ ఏటీఎం+3 ఇత‌ర ఏటీఎంలు) ఉచితం. ఇదే ఇత‌ర టౌన్లు, ప‌ట్టణాల్లో అయితే ప‌ది ట్రాన్స‌క్ష‌న్లు (5 ఎస్‌బీఐ ఏటీఎం+5 ఇత‌ర ఏటీఎంలు) ఉచితంగా ఇస్తారు. ఇక కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇమీడియ‌ట్ పేమెంట్ స‌ర్వీస్ (ఐఎంపీఎస్‌) కింద ఆన్‌లైన్‌లో డ‌బ్బు ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే చార్జీలు వ‌సూలు చేయ‌నున్నారు. ల‌క్ష వ‌ర‌కు రూ.5, స‌ర్వీస్ ట్యాక్స్‌.. ల‌క్ష నుంచి 2 ల‌క్ష‌ల వ‌ర‌కు రూ.15, స‌ర్వీస్ ట్యాక్స్‌.. రూ.2 ల‌క్ష‌ల నుంచి 5 ల‌క్షల వ‌ర‌కు రూ.25, స‌ర్వీస్ ట్యాక్స్ వ‌సూలు చేస్తారు. ఓవైపు ప్ర‌భుత్వం డిజిట‌ల్ ట్రాన్స‌క్ష‌న్ల‌ను ఎంక‌రేజ్ చేస్తుంటే.. ఎస్‌బీఐ వాటిపై చార్జీలువేయ‌డంఆశ్చ‌ర్యంక‌లిగించేదే. ఇక బీఎస్‌బీడీఏ క‌స్ట‌మ‌ర్లు చెక్ బుక్స్ కావాల‌న్నా డ‌బ్బు చెల్లించాల్సిందే. 10 లీఫ్ చెక్ బుక్ కావాలంటే రూ.30, స‌ర్వీస్ ట్యాక్స్‌.. 25 లీఫ్ చెక్ బుక్ కావాలంటే రూ.75, స‌ర్వీస్ ట్యాక్స్‌.. 50 లీఫ్ బుక్ కావాలంటే రూ.150, స‌ర్వీస్ ట్యాక్స్ వ‌సూలు చేస్తారు. జూన్ 1 నుంచి 20కిపైగా లేదా రూ.5 వేలకు పైగా చిరిగిపోయిన నోట్ల‌ను మార్పిడి చేసుకోవాలంటే.. నోటుకు రూ.2, స‌ర్వీస్ చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.

(240)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ