WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలి

జాతిపిత మహాత్మాగాంధీని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కించపరిచే విధంగా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్‌ పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. మహాత్మాగాంధీని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ‘స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేసిన వ్యక్తిని ఇలా తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలి’ అని కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా డిమాండ్‌ చేశారు. ‘మనం ప్రజల దగ్గర ప్రముఖుల గురించి మాట్లాడేటపుడు వారిని గౌరవించాలి. 

 సున్నితమైన భాష ఉపయోగించి మాట్లాడాలి’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ్‌బంగా సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎటువంటి సిద్ధాంతాలు లేకుండా కేవలం స్వాతంత్య్ర లక్ష్య సాధన కోసమే కాంగ్రెస్‌ పార్టీ స్థాపన జరిగింది. అది సిద్ధించిన తర్వాత దానిని రద్దు చేయాలని గాంధీజీ కూడా సూచించారు. ఆయన చాలా తెలివైన వారు’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల కోసం భాజపాను సన్నద్ధం చేయడానికి అమిత్‌ షా దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

(201)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ