అమెరికా టెర్రరిస్ట్ ల లిస్టులో కర్నాటకవాసి 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అమెరికా టెర్రరిస్ట్ ల లిస్టులో కర్నాటకవాసి

కర్నాటకు చెందిన మొహమ్మద్ షఫీ అర్మర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. అగ్రరాజ్యానికి చెందిన ట్రెజరీ శాఖ తాజాగా అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కర్నాటకకు చెందిన షఫీని చేర్చింది. ఇస్లామిక్ స్టేట్ సంస్థకు చెందిన చీఫ్ రిక్రూటర్ గా షఫీ అర్మర్ వ్యవహరిస్తున్నాడని అమెరికా ఓ ప్రకటనలో తెలిపింది. దాంతో అతన్ని గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించినట్లు అమెరికా పేర్కొంది.
షఫీ అర్మర్ది కర్నాటకలో భక్తల్. ఇంటర్ పోల్ కూడా అతనిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. 30 ఏళ్ల అర్మర్ కు అనేక పేర్లు ఉన్నాయి. చోటే మౌలా - అంజన్ భాయ్ - యూసుఫ్ అల్ హింది అని కూడా పిలుస్తారు. భారత్ లో అర్మర్ కీలక ఐఎస్ నేతగా వ్యహరిస్తున్నాడు. ఇస్లామిక్ స్టేట్ సంస్థకు ఉగ్రవాదులను కూడా అతను రిక్రూట్ చేస్తున్నట్లు అమెరికా తన ప్రకటనలో పేర్కొంది. భారత్ లో జరిగిన ఉగ్రవాదులకు కారణమైన అనేకమంది ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరులను అతనే నియమించినట్లు అమెరికా వెల్లడించింది. ప్రస్తుతం అర్మర్ పాకిస్థాన్ లో ఉంటున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఇండియన్ ముజాహిద్దిన్ పై దాడులు పెరగడంతో అతను పాక్ కు వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఫేస్ బుక్ - ఇతర వెబ్ సైట్ల ద్వారా అర్మర్ ఐఎస్ సానుభూతిపరులను రిక్రూట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

(237)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ