WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

శిరీష‌ది ఆత్మ‌హ‌త్యే...!

న‌గ‌రంలో సంచ‌ల‌నం రేకిత్తించిన బ్యూటీషియ‌న్ శిరీష కేసులో రాజీవ్‌, శ్రావ‌న్‌ల‌ను అరెస్టు చేసిన‌ట్లు హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ మ‌హేంర‌ద‌ర్‌రెడ్డి మీడీయాకు వెల్ల‌డించారు. ఈ కేసులో ఏ1గా శ్రావణ్‌, ఏ2గా రాజీవ్‌ను చేర్చామ‌ని చెప్పారు. గ‌త కొద్ది రోజులుగా ఎన్నో మ‌లుపులు తిరిగిన ఈ కేసులో శిరీష‌ది ఆత్మ‌హ‌త్య అని పోలీసులు తేల్చారు. శిరీష స్వ‌స్థ‌లం తూర్పుగోదావ‌రి జిల్లా అచంట అని, బ్యూటీషియ‌న్‌గా, మేక‌ప్ ఆర్టిస్టుగా హైద‌రాబాద్‌లో శిరీష ప‌ని చేస్తున్న‌ట్లు సీపీ వివ‌రించారు. 13 ఏళ్ల క్రితం స‌తీష్ చంద్ర అనే వ్య‌క్తితో శిరీష పెళ్లి జ‌ర‌గింద‌ని, వీరికి 12 ఏళ్ల కూతురు ఉన్న‌ట్లు తెలిపారు.సీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి వివ‌రించిన ప్ర‌కారం... ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ముందు శిరీష‌తో పాటు రాజీవ్‌, శ్రావ‌ణ్ ముగ్గురు క‌లిసి రాత్రి 8.30 గంట‌ల స‌మ‌యంలో రాజీవ్ కారులో కుకునూర్‌ప‌ల్లికి బ‌య‌లు దేరి వెల్లారు. మార్గ‌మ‌ధ్య‌లో మ‌ద్యం, స్నాక్స్ కొనుక్కున్నారు.

కుకునూర్‌ప‌ల్లికి వెళ్లిన‌ త‌రువాత అక్క‌డ ఎస్ఐ ప్ర‌భాక‌ర్‌రెడ్డితో క‌లిసి ఆయ‌న క్వార్ట‌ర్‌లో న‌లుగురూ మ‌ద్య సేవించారు. ఇదంతా కొన‌సాగుతుండ‌గా మ‌ధ్య‌లో రాజీవ్‌, శ్రావ‌ణ్‌లు సిగ‌రెట్ తాగ‌డానికి బ‌య‌టికి వ‌చ్చారు. అప్ప‌డు లోప‌ల ఎస్ఐ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, శిరీష ఇద్ద‌రే ఉన్నారు. కొన్ని నిమిషాల త‌రువాత లోప‌ల శిరీష అరుపులు వినిపించాయి. అప్ప‌డు స్మోక్ చేస్తున్న శ్రావ‌ణ్‌, రాజీవ్‌లు వెంట‌నే వెళ్లే స‌రికి లోప‌ల శిరీష ఓ మూల‌కు భ‌యంతో వ‌ణుకుతూ ప్లీజ్ న‌న్నేం చెయొద్దు, నేను అలాంటిదాన్ని కాద‌ని అరుస్తున్న‌ది. అర‌వ‌ద్ద‌ని రాజీవ్ ఎంత చెప్పినా విన‌కపోవ‌డంతోఅత‌నుఆమెపైచేయిచేసుకున్నాడు.ఇదంతా గ‌మ‌నించిన ఎస్ ప్ర‌భాక‌ర్‌రెడ్డి మ్యాట‌ర్ సిరీయ‌స్ అయ్యేట‌ట్లుంద‌ని, ఇరుగు పొరుగు వాళ్ల‌కు తెలిస్తే బావుండ‌ద‌ని వారిని అక్క‌న్నుంచి వెళ్లిపొమ్మ‌న్నాడు. దీంతో శిరీష‌ను బ‌ల‌వంతంగా కారులో ఎక్కించుకుని హైద‌రాబాద్ బ‌య‌లుదేరారు. కారులో ఎక్కిన త‌రువాత కూడా శిరీష అట్ల‌నే ఏడుస్తూ, అరుస్తూ ఉండ‌టంతో మ‌రోసారి రాజీవ్ అమెను కొట్టాడు. అయినా స‌రే త‌న‌ను వ‌దిలేయండంటూ వేగంగా వెళ్తున్న కారులోంచి శిరీష దిగ‌డానికి ప్ర‌య‌త్నించింది. మొత్తం మీద మ‌ధ్య రాత్రి సుమారు 2.30 గంట‌ల స‌మ‌యంలో వీరు ముగ్గురు శ్రీ‌న‌గ‌ర్ కారులోని రాజీవ్ ఫొటోస్టూడియోకు చేరుకున్నారు. శిరీష లోప‌లికి వెళ్లి త‌లుపు వెసుకుంది. కొద్ది సేప‌టికి రాజీవ్ శ్రావ‌ణ్‌ను పంపించ‌డానికి రోడ్డుపైకి వచ్చాడు. అదే స‌మ‌యంలో శిరీష త‌న మొబైల్ నుంచి రాజీవ్‌కు కాల్ చేసంది. అత‌ను ఆ కాల్‌ను రిసీవ్ చేసుకోలేదు. శ్రావ‌ణ్‌ను పంపించిన‌త‌రువాత ప‌ది నిమిషాల‌కు రాజీవ్ శిరీష‌కు త‌రిగి కాల్ చేశాడు. అప్ప‌డు శిరీష ఫోన్ ఎత్త‌లేదు. అప్ప‌డు రాజీవ్ లోప‌లికి వెళ్లి చూస్తే అమె సీలింగ్‌కు ఉరివేసుకుంది. అప్ప‌డు రాజీవ్ పోలీసుల‌కు ఫోన్ చేశాడు. పోలీసులు అనుమానాస్ప‌ద మృతి కిందకేసున‌మోదుచేశారు. సొంతంగా బ్యూటీ పార్ల‌ర్ న‌డుపుతున్న శిరీష గిట్టుబాటు కావ‌డం లేద‌ని రాజీవ్ స్టూడియోలో బ్యూటీషియ‌న్‌గా ఉద్యోగంలో చేరింది. నాలుగేళ్లుగా అక్క‌డ ప‌ని చేస్తున్నది. ఈ కాలంలో రాజీవ్-శిరీష‌ల మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఏర్ప‌డింది. ఈ మ‌ధ్య కాలంలో రాజీవ్ ఫేస్‌బుక్‌లో తేజ‌స్వినీ అనే మ‌రో అమ్మాయిని ప‌టాయించాడు. తేజ‌స్విని బెంగ‌ళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్న‌ది. వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ శారీర‌క సంబంధం వ‌ర‌కు వ‌చ్చింది. ఇద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మూడు నెల‌ల క్రితం తేజ‌స్వ‌ని బెంగ‌ళూరు నుంచి హైద‌రాబాద్‌కు ట్రాన్స‌ఫ‌ర్ చేయించ‌కుంది. కొద్ది రోజుల క్రితం రాజీవ్ కోసం తేజ‌స్విని శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలోని ఫొటో స్టూడియోకు వ‌చ్చిన‌పుడు అత‌ను అందుబాటులో లేడు. భార్య‌తో క‌లిసి ఇప్పుడే బ‌య‌టికి వెళ్లార‌ని స్టూడియోలో ప‌ని చేసేవాళ్లు చెప్పారు.ఇక్క‌డే తేజ‌స్వినికి అనుమానం వ‌చ్చింది. తాను పెళ్లి చేసుకుందామ‌నుకున్న వ్య‌క్తికి భ్యార్య ఎట్లుంట‌ద‌ని ఆమె రాజీవ్ గురించి ఆరా తీసింది. శిరీష‌తో రిలేష‌న్ షిప్ ఉన్న విష‌యం ఆమెకు తెలిసింది. ఈ వ్య‌వ‌హారం కాస్త పెద్ద‌ద‌యింది. శిరీష‌, తేజ‌స్విని ఇద్ద‌రూ బూతులు తిట్టుకుని, కొట్టుకునే స్థాయికి చేరింది. త‌ర‌చూ స్టూడియోకు వ‌చ్చి తేజ‌స్విని గొడ‌వ చేయ‌డం మొద‌లు పెట్టింది. ఈ నేప‌థ్యంలో తేజ‌స్వినికి రాజీవ్ దూరం కావ‌డం మొద‌లుపెట్టాడు. తేజ‌స్విని రాజీవ్‌ను గ‌ట్టిగా నిల‌దీసింది. త‌న‌ను మోసం చేసిన‌ట్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని బెదిరించింది. దీంతో రాజీవ్ ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇరువురు పోలీస్టేష‌న్‌లో కేసులు పెట్టుకున్నారు. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని రాజీవ్ నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే శిరీష త‌న స్నేహితుడు శ్రావ‌ణ్‌కు ఫోన్ చేసి త‌న ప్రాబ్ల‌మ్‌ను వివ‌రించింది.

ఈ వ్య‌వ‌హారంలోకి శ్రావ‌ణ్ ఎంట‌ర‌యి త‌న స్నేహితుడు, కుకునూరు ప‌ల్లి ఎస్ఐ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వ‌ద్ద‌కు పంచాయ‌తీని తీసుకెళ్లాడు. ఎస్ఐ ప్ర‌భాక‌ర్‌రెడ్డి బంజార‌హిల్స్‌లో త‌న బ్యాచ్‌మేట్ ఎస్ఐగా ఉన్నాడు అత‌నికి చెప్పి సెటిల్ చేయిస్తానులే అని మాటిచ్చాడు. ఇంత‌లోపే తేజ‌స్విని రాజీవ్‌పై పెట్టిన కేసు విష‌యంలో మ‌రో సారి పోలీసుల‌ను క‌లిసింది. రెండు రోజులు చూద్దాం, బ‌య‌ట ప‌రిష్క‌రించుకోవాడానికి ప్ర‌య‌త్నం చేస్తాను, అప్ప‌టికీ కాక‌పోతే మీరు డీల్ చేయండ‌ని పోలీసుల‌నుకోరింది. ప్ర‌భాక‌ర్‌రెడ్డి సూచ‌న‌మేర‌కు ఈ నెల 12 శిరీష‌తో క‌లిసి రాజీవ్‌, శ్రావ‌ణ్‌లు బంజార‌హిల్స్ పోలీస్టేష‌న్‌కు వెళ్లి ఆయ‌న బ్యాచ్‌మేట్ ఎస్ఐని క‌లిశారు. ఈ కేసును వేరే ఎస్ఐ చూస్తున్నారు అత‌న్ని క‌ల‌వండ‌ని ఆయ‌న మ‌రో ఎస్ఐ పేరు చెప్పారు. వారు ఆ కేసును డీల్ చేస్తున్న ఇంకో ఎస్ఐని క‌ల‌వ‌గా వేరే ప‌నిలో బిజీగా ఉన్నాను, పైగా ఇది ఫ్యామిలీ మ్యాట‌ర్ క‌దా, కొంచెం డీప్‌గా స్ట‌డీ చేయాలి, వారం రోజుల త‌రువాత క‌ల‌మ‌ని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఆ ముగ్గురు మ‌ళ్లీ ఎస్ఐ ప్ర‌భాక‌ర్‌రెడ్డికి ఫోన్ చేసి ఈ పంచాయతీని ప‌రిష్క‌రించాలని, తాము కుకునూర్ప‌ల్లికిబ‌య‌లుదేరివ‌స్తున్నామ‌నిచెప్పారు.అదే రోజు రాత్రి 8.30 స‌మ‌యంలో రాజీవ్ కారులో కుకునూర్‌ప‌ల్లికి బ‌య‌లు దేరి వెళ్లారు. అక్క‌డ ఎస్ క్వార్ట‌ర్‌లో అంద‌రూ క‌లిసి మ‌ద్యం సేవించారు. గొడ‌వ జ‌రిగింది. త‌రిగి హైద‌రాబాద్ బ‌య‌లుదేరి వ‌చ్చారు. శిరీష ఆత్మ‌హ‌త్య చేసుకుంది. హైద‌రాబాద్ సీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి వివ‌రించిన ప్ర‌కారం ఇదీ స్టోరి. ఈ కేసులో శ్రావ‌ణ్‌ను ఏ1గా చేర్చిన‌ట్లు సీపీ చెప్పారు. శ్రావ‌ణ్ గ‌త ప్ర‌వ‌ర్త‌న ప్ర‌కారం ఇందులో అత‌ని పాత్ర‌నే ప్ర‌ధానంగా ఉన్న‌ట్లు త‌మ ద‌ర్యాప్తులో తేలింద‌ని చెప్పారు.


(329)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ