ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ తమ రాష్ట్రపతి అభ్యర్థి అని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు. రామ్‌నాథ్ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన దళిత నేత. యూపీ నుంచి  ఏళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. బీజేపీ దళిత మోర్చ జాతీయ అధ్యక్షుడిగాబీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు.అక్టోబర్ న జన్మించారు. హైకోర్టుసుప్రీంకోర్టుల్లో న్యాయవాదిగా పనిచేశారు.సుదీర్ఘ చర్చల అనంతరం రామ్‌నాథ్ పేరు నిర్ణయించామని అమిత్ షా తెలిపారు. బీజేపీలో అత్యంత ఉన్నతస్థాయికి ఎదిగిన దళిత నేత రామ్‌నాథ్. ఎన్డీయే తరపున అన్నిపార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎన్డీఏ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని విపక్షాలకు ఫోన్ లో తెలిపామన్నారు. విపక్షాలు వాళ్ల పార్టీల్లో చర్చించుకొని మాతో కలిసి వస్తాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. తమ అభ్యర్థి ఈ నెల న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు అమిత్‌షా వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టులో నుంచి  వ‌ర‌కు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ అడ్వ‌కేట్‌గా ఉన్నారు.  నుంచి  వ‌ర‌కు ఆయ‌న సుప్రీంకోర్టులో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ స్టాండింగ్ కౌన్సిల్ స‌భ్యుడిగా ఉన్నారు. లో ఆయ‌న సుప్రీంకోర్టులో అడ్వ‌కేట్‌-రికార్డ్‌గా ప‌నిచేశారు. ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో ఆయ‌న  ఏళ్లు ప‌నిచేశారు. ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో లో రామ్‌నాథ్ న్యాయ‌వాదిగా పేరు న‌మోదు చేసుకున్నారు.
రామ్‌నాథ్ రాజ‌కీయ కెరీర్ లో మొద‌లైంది. యూపీ నుంచి రాజ్య‌స‌భకు ఎంపీగా ఎంపిక‌య్యారు.  వ‌ర‌కు ఎంపీగా ఆయ‌న రెండుసార్లు చేశారు. పార్ల‌మెంట్‌కు చెందిన అనేక క‌మిటీల్లోనూ ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు. పార్ల‌మెంట్‌కు చెందిన‌ ఎస్సీఎస్టీ సంక్షేమ శాఖ‌హోంశాఖ‌పెట్రోల్ మ‌రియు ఇంధ‌నంసామాజిక న్యాయంలా అండ్ జ‌స్టిస్‌రాజ్య‌స‌భ హౌజ్ క‌మిటీల్లో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు. రామ్‌నాథ్ భార్య పేరు స‌వితా కోవింద్‌. వీరికి ఒక కుమారుడుఒక కుమార్తె ఉన్నారు. ఎన్డీఏ పార్టీ ఇవాళ రామ్‌నాథ్‌ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

(224)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ