WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రేవంత్ రెడ్డితో రాయభారానికి దిగిన‘బడా బాబులు’

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో జరిగిన భారీ కుంభకోణం వెనక ‘బడా బాబులు’ ఉన్నారా?. అంటే ఖచ్చితంగా అవుననే చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు ఆధారాలతో సహా బయటకు రానున్నాయి. దీనికి సంబంధించి  తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ రేవంత్ రెడ్డితో ‘భాయభారం’ మొదలైందని విశ్వసనీయ వర్గాల సమాచారం.  సహజంగా ఇందులో పాలుపంచుకున్న వాళ్ళకు ఆ విషయం ఎలాగూ తెలుస్తుంది కదా?.. ఓ మీడియా అధిపతి ఈ రాయభారం నడపగా..అందుకే రేవంత్ రెడ్డి ససేమిరా అన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి వీడియో సాక్షిగా పట్టుపట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మియాపూర్ తోపాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన వేల కోట్ల రూపాయల భూ స్కామ్ ఓ పెద్ద అస్త్రంగా దొరికింది. 

  అందుకే ఆయన పూర్తి స్థాయిలో ఆ అంశంపై ఫోకస్ పెట్టారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంటే రేవంత్ రెడ్డి ఈ విషయంలో జోరు మీదున్నారు. ఈ వివరాలు అన్నీ ఆధారాలతో సహా బయటికి వస్తే కొంత మంది పెద్దలకు ఖచ్చితంగా ఇబ్బంది కలగటం ఖాయం. అందుకే మధ్యవర్తిగా ఓ మీడియా అధినేత రంగంలోకి దిగగా…ఈ విషయంలో మాత్రం రేవంత్ ససేమిరా అన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎందుకంటే గతంలో తనను రాజకీయంగా అంతం చేసేందుకు టార్గెట్ చేసి ఇరికించారని అభిప్రాయంతో ఉన్న రేవంత్..ఈ మియాపూర్ భూ స్కామ్ ను ఓ ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు సాగుతున్నారు. ఇఫ్పటికే పలు ఆధారాలు సేకరించిన ఆయన రాబోయే రోజుల్లో వీటిని బహిర్గతం చేయనున్నారని సమాచారం. మొత్తానికి మియాపూర్ స్కామ్ రాజకీయంగా రాబోయే రోజుల్లో ప్రకంపనలు సృష్టించటం ఖాయంగా కన్పిస్తోంది. రేవంత్ రెడ్డి మాత్రం ఈ భూ స్కామ్ విషయంలో నేరుగా సీఎం ఫ్యామిలీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి సంబంధించి రేవంత్ దగ్గర పలు ఆధారాలు ఉన్నట్లు సమాచారం.

 

(396)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ