WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

విపక్షపార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్‌

లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను విపక్ష పార్టీలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకున్నాయి. లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ను బరిలో దింపుతున్నట్టు ప్రకటించాయి. ఇప్పటికే అధికార ఎన్డీయే తమ అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును ప్రకటించిన నేపథ్యంలో విపక్షాలు ఎవరిని తమ అభ్యర్థిగా బరిలో దింపుతాయనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం దిల్లీలోని పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో భేటీ అయిన విపక్షాలు తమ అభ్యర్థిగా మీరాకుమార్‌ను పోటీలో నిలుపుతున్నట్టు స్పష్టంచేశాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థులుగా మీరాకుమార్‌, అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. మీరాకుమార్‌ వైపే మొగ్గుచూపాయి. దీంతో జులై 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్‌నాథ్‌ కోవింద్‌పై మీరాకుమార్‌ తలపడనున్నారు. మీరా గతంలో కేంద్రమంత్రి, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. ఈ నెల 27 లేదా 28న నామినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె నామినేషన్‌ పత్రాలపై సంతకాల కార్యక్రమాన్ని కూడా విపక్షాలు ప్రారంభించాయి.మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ కుమార్తె అయిన మీరాకుమార్2009-14 మధ్య లోక్‌సభ సభాపతిగా విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు పోటీగా ప్రతిపక్షాలు దళిత మహిళ మీరాకుమార్‌ను తమ అభ్యర్థిగా బిహార్‌కుచెందినమీరాకుమార్‌నుప్రకటించాయి.పార్లమెంటు లైబ్రరీ భవనంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన విపక్ష పార్టీల కీలక భేటీ ముగిసింది. ఈ భేటీకి మన్మోహన్‌సింగ్సీతారం ఏచూరిసురవరం సుధాకర్‌రెడ్డిరాంగోపాల్ యాదవ్శరద్ పవార్కనిమొళిఇతర నేతలు హాజరయ్యారు.

(224)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ