WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

జూబ్లిహిల్స్ లో 7 కోట్ల రద్దైన పాతనోట్ల స్వాధీనం

పెద్దనోట్ల మార్పిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా నగరంలోని జూబ్లిహిల్స్‌లో పెద్ద ఎత్తున పాత కరెన్సీ నోట్లు పట్టుబడ్డాయి. పెద్ద మొత్తంలో నోట్ల మార్పిడి జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7 కోట్ల రద్దైన పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు సినీనటి జీవితా రాజశేఖర్‌కు సమీప బంధువుగా తెలుస్తోంది.జూబ్లిహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శ్రీనివాస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పేరుతో కంపెనీ నడుపుతున్న శ్రీనివాస్‌తో పాటు రవి అనే మరో వ్యక్తిని సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఈ అంశంలో జీవిత ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్‌తో గతంలోనూ ఒకసారి అరెస్టైనట్టు తెలుస్తోంది. డ్రగ్స్‌ తీసుకుంటూ ఒకసారి అతడు పోలీసులకు చిక్కాడు.నగరంలో గురువారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున పాతనోట్లు పట్టుబడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే.కాగా  ఈ వ్యవహారంలో అరెస్టయిన శ్రీనివాసరావు తమకు సన్నిహితుడంటూ వచ్చిన వార్తలపై నటి జీవిత స్పందించారు. పాత నోట్లతో దొరికిపోయిన శ్రీనివాసరావు తన కార్యాలయంతోపాటు ఇతరుల వద్ద కూడా పనిచేస్తున్నారని, ఆయనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె మీడియాకు తెలిపారు.ఫిలింనగర్‌లోని శ్రీనివాస ప్రొడక్షన్‌ కార్యాలయంలో రూ. 7 కోట్ల విలువైన పాత నోట్లు దొరికాయి. ఈ వ్యవహారంలో శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ శ్రీనివాసరావు తన తమ్ముడని మీడియాలో వచ్చిన కథనాలను ఆమె ఖండించారు. శ్రీనివాసరావు తన తమ్ముడు కాదని, తన తమ్ముడు మురళీ శ్రీనివాస్‌ నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆమె తెలిపారు. అరెస్టైన శ్రీనివాసరావు తమ ఆఫీసులో మేనేజర్‌గా పనిచేస్తున్న మాట వాస్తవమేనని, అయితే, అతను తమ ఆఫీసుతోపాటు మరో నాలుగైదు ఆఫీసులలోనూ పనిచేస్తున్నాడని, తన వద్ద అతనితోపాటు మరో నలుగురు మేనేజర్లు పనిచేస్తున్నారని చెప్పారు. తమ కార్యాలయం ఉన్న భవనంలోనే శ్రీనివాసరావు ఆఫీసు ఉందని, అయితే, తమ కార్యాలయం పేరు జోత్స్న ప్రొడక్షన్‌ అని, ప్రస్తుతం ‘గరుడవేగ’ సినిమాను ఈ ప్రొడక్షనే తీస్తున్నదని చెప్పారు. పాతనోట్ల వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదనిఈ కేసులో తనకు పోలీసుల నుంచి ఎలాంటి కాల్‌ రాలేదని చెప్పారు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం ఉందని ఎవరు చెప్పారో చెప్పాలని ఆమె మీడియాను ప్రశ్నించారు. అరెస్టయిన శ్రీనివాసరావుతో తన తమ్ముడికి కూడా ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

(131)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ