లేటెస్ట్

‘సీమ’లో పుంజుకుంటున్న ‘టిడిపి’..!?

ఒకప్పుడు రాయలసీమలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ గత సార్వత్రిక ఎన్నికల దెబ్బకు కుదేలయిపోయింది. రాయలసీమ మొత్తం మీద 52 సీట్లు ఉంటే ఆ ఎన్నికల్లో కేవలం మూడు స్థానాల్లో మాత్రమే ‘టిడిపి’ గెలవగలిగింది. ఈ ఫలితాలను చూసి టిడిపి శ్రేణులు నివ్వెరపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత ‘రాయలసీమ’ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడిరది. ఎప్పటి నుంచో ‘రాయలసీమ’ వాసుల కల అయిన  కృష్ణా నీటిని తీసుకవచ్చింది. దీనితో పాటు వెనుకబడిన ‘చిత్తూరు, అనంతపురం’ జిల్లాల్లో భారీ ఎత్తున పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేసింది. ప్రపంచ మేటి సంస్థ అయిన ‘కియా’ను ‘చంద్రబాబు’ ప్రభుత్వం ‘అనంత’కు తెచ్చింది. ‘కియా’ ప్రాజెక్టు వల్ల వస్తోన్న ప్రయోజనాలు ఇప్పుడు ప్రజలు ప్రత్యక్షంగానే చూస్తున్నారు. ఎంతో చేసినా ఆ ఎన్నికల్లో ‘టిడిపి’ ఈ ప్రాంతంలో చావుదెబ్బ తింది. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా పరిస్థితుల్లో మార్పు వస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.


గతంలో వైకాపా కురిపించిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేకపోవడం, ఒకసారి ‘జగన్‌’ పాలనను చూడాలనే మోజు తీరిపోవడంతో ఇక్కడి ప్రజలు మళ్లీ ‘టిడిపి’ వైపు చూస్తున్నారు. తప్పుడు హామీలను నమ్మడం వల్ల అభివృద్థికి నోచుకోలేకపోయామని, తమ పిల్లల భవిష్యత్‌ అంథకారమైందని, ఉపాధిలేదని ప్రజలు ఆక్రోశిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ ప్రాంతంలో ‘టిడిపి’ వైకాపా కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తుందని ఒక సర్వేలో తేలింది. మిగతా మూడు జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా ‘అనంతపురం’ జిల్లాలో మాత్రం టిడిపి బ్రహ్మాండంగా పుంజుకుందనే మాట వినిపిస్తోంది. ఈ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సీట్లు ఉంటే ఇప్పుడు దాదాపు 8 సీట్లను టిడిపి గ్యారెంటీగా గెలుచుకుంటుందని ఆ సర్వే స్పష్టం చేసింది. మరో రెండు సీట్లలో హోరా హోరి పోరు ఉందని, మరో 4సీట్లలో ఇప్పటికీ వైకాపాకే మొగ్గు ఉందని సర్వే తెలిపింది. టిడిపి నాయకుల్లో ఉన్న విభేదాలతో కొన్ని సీట్లల్లో టిడిపి వెనుకబడిపోయిందని, వారు ఐక్యతతో పనిచేస్తే 10సీట్ల ఖాయంగా గెలుచుకుంటుందని టిడిపి అభిమానులు చెబుతున్నారు. మొత్తం మీద ‘సీమ’లో మార్పు మొదలైందని తెలుస్తోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ