ఆధార్‌ పై తదుపరి విచారణ జులై 7కు వాయిదా 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆధార్‌ పై తదుపరి విచారణ జులై 7కు వాయిదా

 ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌, నవీన్‌ సిన్హాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఆధార్‌ లేదని సంక్షేమ పథకాల లబ్ధిని నిరాకరించొద్దని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించింది. ఈ సందర్భంగా అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఆధార్‌ లేకుండా సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు జున్‌ 30 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు గడువు పొడిగిస్తున్నట్టు ధర్మాసనానికి స్పష్టంచేశారు. ఇటీవల పాన్‌ కార్డ్‌తో ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని సుప్రీం న్యాయస్థానం స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ఆధార్‌ వ్యవహారంపై తదుపరి విచారణను జులై 7కు వాయిదా వేసింది.

(236)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ