WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

జీఎస్టీ వల్ల సామాన్యుడుపై పడే భారం ఎంత?

ఈ అర్థరాత్రి నుంచి దేశం కొత్తపన్నుల విధానం కిందకు రానుంది. ఒక దేశం..ఒక పన్ను నినాదంతో కేంద్రం తెస్తున్న కొత్త వస్తు సేవల పన్ను జీఎస్టీ అమలులోకి రానుంది. అయితే ఈ పన్నుపై ఆర్థిక వేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక దేశం..ఒక పన్ను నినాదం కరెక్టు కాదని,జీఎస్టీ అమలుతో ఒక దేశం..ఒక వస్తువు.. ఒక పన్ను అనడం సరైనదని ప్రముఖ అనలిస్టు లక్ష్మణరావు అన్నారు. జీఎస్టీ వచ్చాక నెలకు రూ. 30వేలు ఖర్చుపెట్టే సామాన్యుడుపై ఎంతభారం పడుతుంది?బంగారం కొంటె ఎంత పన్ను కట్టాలి?బియ్యం జిఎస్టీ పరిధిలోకి వస్తుందా?రాదా?అనే సందేహాలపై లక్ష్మణరావు పలు సమాధానాలు ఇచ్చారు. ఈ అర్థరాత్రి భారత దేశం ఒక చారిత్రాత్మక సంస్కరణలకు నాందికాబోతుంది. శుక్రవారం రాత్రి కేంద్రప్రభుత్వం ఒక ప్రత్యేక సమావేశాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఏర్పాటు చేసింది. జీఎస్టీకి సంబంధించిన జేగంటలు ఈ అర్థరాత్రి 12గంటల నుంచి మోగటంతోపాటు దేశం మొత్తం ఒకే పన్ను కిందకు వస్తుంది. ఈ జీఎస్టీ వల్ల సామాన్యుడుపై పడే భారం ఎంత?మధ్యతరగతి ప్రజలుఉద్యోగులు తమ కుటుంబానికి సంబంధించి నెలవారి ఖర్చులు...ప్రస్తుతం చేస్తున్నది ఎంత?జీఎస్టీ వల్ల అనదంగా ఎంత ఖర్చు అవుతుంది?అతనికొచ్చే ప్రయోజనం ఏమిటి?అతని మీద పడే భారం ఎంత?అని ప్రభుత్వం తెలుపాల్సిన అవసరం ఉందన్నారు లక్ష్మణరావు.

(80)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ