చైనా వార్నింగ్‌ను తిప్పికొట్టిన భారత్ 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చైనా వార్నింగ్‌ను తిప్పికొట్టిన భారత్

1962 యుద్ధం నుంచి పాఠాలు నేర్చుకోండంటూ చైనా ఇచ్చిన వార్నింగ్‌ను ఇండియా తిప్పికొట్టింది. దీనిపై కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. అప్ప‌టికీఇప్పటికీ ఇండియా చాలా మారింద‌ని చైనాకు చెప్పారు. 1962ఇండియాకి2017ఇండియాకి చాలా తేడా ఉంది. అది చైనా గుర్తించాలి అని జైట్లీ ఘాటుగా స్పందించారు. సిక్కిం స‌రిహ‌ద్దుల్లో చైనాతో ఏర్ప‌డిన ఉద్రిక్త‌త‌లు ఈ మాట‌ల యుద్ధంతో మ‌రింత వేడెక్కేలా క‌నిపిస్తున్నాయి. భార‌త బ‌ల‌గాలు త‌మ భూభాగంలోకి వ‌చ్చాయంటూ చైనా తీవ్రంగా హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. 1962 యుద్ధాన్ని చూసి పాఠాలు నేర్చుకోండి అంటూ ఇండియ‌న్ ఆర్మీకి చైనా వార్నింగ్ ఇచ్చింది. దీనికి జైట్లీ కూడా ఘాటుగానే స్పందించారు. నిజానికి చైనా చెబుతున్న భూభాగం త‌మద‌ని భూటాన్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఇదే విష‌యాన్ని జైట్లీ గుర్తు చేశారు. భూటాన్ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌తో అక్క‌డ ప‌రిస్థితి ఏంటో స్ప‌ష్ట‌మైంది. అది భూటాన్ భూభాగం. ఇండియ‌న్ బోర్డ‌ర్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంది. అక్క‌డ ఇండియాభూటాన్ క‌లిసి భ‌ద్ర‌త క‌ల్పించేలా ఒప్పందం కుదిరింది అని జైట్లీ తెలిపారు. ఇత‌ర దేశాల భూభాగాన్ని ఇండియా ఆక్ర‌మిస్తున్న‌ద‌ని చైనా చెబుతున్న‌ద‌నిఅది పూర్తిగా అబ‌ద్ధ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు.

 కాగా సిక్కిం స‌రిహద్దులో భార‌త బ‌ల‌గాలు చైనా భూభాగంలోకి అడుగుపెట్ట‌డంపై ఆ దేశం ఆగ్ర‌హంగా ఉంది. 1962యుద్ధం గుర్తుందిగా.. ఇండియ‌న్ ఆర్మీ చ‌రిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి అని చైనా హెచ్చ‌రించింది. చైనీస్ మిలిట‌రీవిదేశాంగ శాఖ ఈ విష‌యంలో భార‌త్‌పై గుర్రుగా ఉన్నాయి. వెంట‌నే బ‌ల‌గాల‌ను వెన‌క్కి పిల‌వాల‌ని స్ప‌ష్టంచేశాయి. అంత‌ర్గత భ‌ద్ర‌త‌తోపాటు చైనాపాకిస్థాన్‌ల‌తో యుద్ధానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఇండియ‌న్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావ‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌పై చైనా మండిప‌డ్డారు చైనీస్ ఆర్మీ అధికార ప్ర‌తినిధి వు కియాన్‌. ఇవి చాలా బాధ్య‌తారాహిత్య‌మైన వ్యాఖ్య‌ల‌ని వు స్ప‌ష్టంచేశారు. ఆ వ్య‌క్తి గ‌త అనుభ‌వాల నుంచి పాఠాలు నేర్చుకొని.. యుద్ధానికి సై అన‌డాన్ని ఆపాల‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఇండియాభూటాన్‌చైనా స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన డోక్లామ్‌డోకా లా మధ్య రోడ్డు నిర్మాణాన్ని చేప‌ట్టింది చైనా. అయితే భార‌త బ‌ల‌గాలు త‌మ భూభాగంలోకి వ‌చ్చి.. రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నాయ‌ని చైనా ఆరోపించింది. ఈ స‌మ‌స్య‌కు చ‌ర్చ‌ల‌ తో ప‌రిష్కారం క‌నుగొందామ‌ని చైనా విదేశాంగ శాఖ చెప్పింది.

(254)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ