WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మీరు బ్లూ ఫిల్మ్స్ చూస్తారా!

కర్ణాటక సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

 కర్ణాటక సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలు కర్ణాటకలో పెను దుమారాన్నే రేపుతున్నాయి. బెళగావి జిల్లాలో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి మీరు బ్లూ ఫిల్మ్స్ చూస్తారా అని అడిగారు. అయితే ఈ ప్రశ్న అడగడానికి కారణం ఉందంటున్నారు సిద్దరామయ్య. బీజేపీ నేతల్లో కొందరిని ఉద్దేశించే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలివి.మీ బీజేపీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఎందుకు పోగొట్టుకున్నారో తెలుసామీరు అడగండి. అసలు బ్లూ ఫిల్మ్ అంటే ఏంటో మీకు తెలుసాఎప్పుడైనా ఒక్కసారైనా చూశారాఅసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయం లోపల మీ ఎమ్మెల్యే బ్లూ ఫిల్మ్ చూస్తూ దొరికిపోయాడు. అలాంటి ఎమ్మెల్యేని అధికారంలో ఉంచకూడదు. వెంటనే దించేయాలి. ఇలాంటి వ్యక్తులు జనజీవనంలో ఇంకా ఎందుకు కొనసాగుతున్నారో అర్థం కావడం లేదు. ఇలాంటి సిగ్గులేని వ్యక్తి రాజీనామా చేసిరాజకీయాల నుంచి తప్పుకోవాలి అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దారామయ్య బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

(205)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ