సిక్కింలో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. డోకాలా దగ్గర చైనా నిర్మిస్తున్న రోడ్డును భారత్ అడ్డుకున్నది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు మొదలయ్యాయి. భారత జవాన్లు తమ భూభాగంలోకి ప్రవేశించినట్లు చైనా దళాలు తాజాగా ఓ మ్యాప్‌ను కూడా రిలీజ్ చేశాయి. అంతేకాదు ఈఏడాది భారతీయ జర్నలిస్టులకు చైనా విజిట్‌ను కూడా రద్దు చేశారు. బోర్డర్ సమస్యల విషయంలో వెనక్కి తగ్గేది లేదని చైనా నిపుణులు పేర్కొన్నారు. అవసరమైతే యుద్ధానికి కూడా వెళ్తామంటున్నారు. 3488కిలోమీటర్ల పొడవైన ఇండో-చైనా సరిహద్దులో220 కిలోమీటర్లు సిక్కిం సెక్షన్ పరిధిలోనే ఉంది. ఒక్క సిక్కిం రాష్ట్రంలోనే భారత్-చైనా మధ్య స్పష్టమైన సరిహద్దులు ఉన్నాయి. 1898లో చైనాతో జరిగిన ఒప్పందం మేరకు ఈ సరిహద్దుల్ని ఖరారు చేశారు.
అంతర్జాతీయ సరిహద్దుకు 15కిలోమీటర్ల దూరాన ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు బృందాలను ఏర్పాటు చేసిన భారత్ 1962 యుద్ధ సమయంలోనూ హద్దుల చెరిపివేతకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. అయితే కీలకమైన ప్రాంతంలో యుద్ధట్యాంకులు వెళ్లేందుకు వీలుగా రోడ్డు నిర్మించాలన్నది చైనా ఆలోచన. దీనికి భారత్భూటాన్ దేశాలు అంగీకరించడంలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో జూన్ రెండవవారంలో చైనాను భారత్ రెండుసార్లు ఫ్లాగ్ మీటింగ్‌కు ఆహ్వానించింది. అయితేమూడోసారి సమావేశానికి అంగీకరించిన చైనాలాల్తెన్ ప్రాంతం నుంచి బలగాలను వెనక్కితీసుకోవాలని చెప్పింది. అందుకు భారత్ అంగీకరించలేదు. దీంతో47మందితో కూడిన తొలివిడత మానససరోవర్ యాత్రికుల బృందానికి చైనా అనుమతి నిరాకరించింది. మరో 50మంది యాత్రికులకు వీసాలను రద్దు చేసింది. నాథులా నుంచి కైలాశ్ మానససరోవరానికి వెళ్లే బస్సు మార్గాన్నీ మూసేశారు. బలగాలను భారత్ వెనక్కి తీసుకుంటేనే యాత్రికులను అనుమతిస్తామని చైనా షరతు పెట్టింది. చంబీలోయపై తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు డ్రాగన్ దేశం ప్రయత్నిస్తున్నదనిఅందుకోసమే డోకా-లాలో అడుగులు వేస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. భారత్-భుటాన్ సరిహద్దు పొడవునా తన నిఘాను పటిష్టం చేసుకోవాలన్నది చైనా ఎత్తుగడ. 2008లోనూ భారత బంకర్‌ను ధ్వంసం చేసిన చైనా పదే పదే తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నది.
ఇండియానే సరిహద్దు దాటి వచ్చిందంటూ గగ్గోలు పెడుతూ మనదేశంపై ఒత్తిడిపెంచేప్రయత్నంచేస్తున్నది.కాగా డోకాలా సమస్యను సరిగా హ్యాండిల్ చేయని పక్షంలో యుద్ధం ఉత్పన్నమయ్యే అవకాశాలున్నట్లు చైనా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొందరు ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. డోకాలా వివాదంపై ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చినా ఆశ్చర్యం లేదని మరోవైపు చైనా నిపుణులు అంచనా వేస్తున్నారు.1962లో చైనాతో జరిగిన యుద్ధాన్ని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ గుర్తు చేసిన విషయం తెలిసిందే. ఇది అప్పటి భారత్ కాదు అని ఆయన అన్నారు. 1962 యుద్ధంలో సుమారు 722మంది చైనీయ4383 మంది భారతీయ సైనికులు చనిపోయారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలనిచైనాప్రొఫెసర్లుసూచిస్తున్నారు.
క్షమించాలి మీరు వార్త మీద ఇష్టం లేదా వ్యతిరేకత ఇవ్వాలంటే మీరు లాగిన్ అయి ఉండవలెను .
LOGIN
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే ఇష్టపడి ఉన్నారు
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే వ్యతిరేకించి ఉన్నారు
అభిప్రాయాలూ