WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పాపం...'జగన్‌'....! (వీడియో)

ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌కోవింద్‌ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర సంఘటన జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని హోటల్‌ హయత్‌పార్క్‌కు వచ్చిన ఆయనకు వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పాదాభివందనం చేశారు. ఆయనతో పాటు వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా 'కోవింద్‌' కాళ్లకు నమస్కరించారు. ఇప్పుడు వీరి పాదాభివందనాల వీడియో నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. 'కోవింద్‌' రాష్ట్రపతి కాకుండానే ఆయన కాళ్లు పట్టుకోవడం ఏమిటని వైకాపా కార్యకర్తలే అసహనంతో ఊగిపోతున్నారు. మీడియా సాక్షిగా 'పులివెందులపులి' ఇలా చేయటం బాగాలేదని హార్డ్‌కోర్‌ వైకాపా అభిమానులు వాపోతున్నారు. ఎందుకు తమ పార్టీ అధినేత ఇలా వ్యవహరించారో తెలియక వారు మదనపడుతున్నారు. 'కోవింద్‌' వయసులో పెద్దవారు కనుక కాళ్లకు దండం పెట్టారని సమర్థించుకోవచ్చు. కానీ ఇంతకు ముందు వై.ఎస్‌.జగన్‌ ఎప్పుడూ ఇలా వ్యవహరించిన సందర్భమే లేదు. సహజంగా అహంకార పూరితంగా వ్యవహరిస్తారని పేరున్న 'జగన్‌' ఈ రోజు 'జగన్‌' చూపించిన వినయానికి స్వంత పార్టీనేతలు, ఆయన సహచరులే ఆశ్చర్యపోతున్నారు. ఆయన కేసులకు భయపడే ఇలా చేశారని ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలు నిజమేనని ఆయన నిరూపించారని వారు వాపోతున్నారు.

   తనపై ఉన్న కేసులు తరుముకొస్తున్న వేళ 'జగన్‌' వాటి నుండి తప్పించుకునేందుకు ఎటువంటి పనులైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్‌డిఎలో భాగస్వామి కాని 'జగన్‌' ఎన్‌డిఎ అభ్యర్థికి భేషరతుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, ఆయన కాళ్లు పట్టుకోవడం అంటే ఆయనపై ఉన్న కేసులు ఎంత బలంగా ఉన్నాయో అర్థం అవుతున్నాయని వారు అంటున్నారు. రేపు ఏదైనా కేసులో 'జగన్‌'కు జైలుశిక్ష పడితే రాష్ట్రపతి హోదాలో ఆయన కాపాడతారనే ఉద్దేశ్యంతోనే 'జగన్‌' ఇలా వ్యవహరించారని వారు విమర్శిస్తున్నారు. లక్షల కోట్లు దోచిన వై.ఎస్‌.జగన్‌ ఇప్పుడు దొరికిపోయిన దొంగలా ప్రతి ఒక్కరినీ ఆదుకోమని కోరుతున్నారని ఇటీవల కాలంలో ఆయన ప్రవర్తనే ఇందుకు నిదర్శనమని వారు వాదిస్తున్నారు. మొత్తం మీద 'జగన్‌' ఈ రోజు వ్యవహరించిన తీరు ఆయన అభిమానులను నిరుత్సాహానికి గురి చేసింది. పులివెందుల పులిబిడ్డ...మాట తప్పం...మటమ తిప్పం..అంటూ చెప్పుకునే తమ 'జగనన్న' ఇలా కాళ్ల బేరానికి రావడం వారికి రుచించలేదు...!  





(665)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ