WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సరుకులపై జీఎస్‌టీ ధరలు లేకుంటే జైలుకే!

వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) శ్లాబుల్లోని కొత్త ధరలను ఇప్పటికే ఉన్న సరుకులపై ముద్రించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాసవాన్‌ దుకాణాదారులు, వ్యాపారులకు స్పష్టం చేశారు. లేదంటే లక్ష రూపాయల జరిమానా, జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. కొత్త ధరలతో పాత సామగ్రిని సెప్టెంబర్‌ లోపు అమ్ముకోవాలని తయారీదారులకు ప్రభుత్వం గడువు విధించింది. 

  జీఎస్‌టీ అమలుతో తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం వినియోగదారుల మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్‌ సేవలను 14 నుంచి 60 పెంచింది. ఇప్పటికే 700కు పైగా వచ్చిన సందేహాలను ఫైనాన్స్‌ నిపుణుల ద్వారా నివృత్తి చేస్తున్నారు. ‘అమ్ముడుపోని సరుకులపై సవరించిన ధరలు ముద్రించాలని ఇప్పటికే సంస్థలను ఆదేశించాం. కొత్త ధరలతో స్టిక్కర్లు అంటిస్తే వినియోగదారులకు అవి జీఎస్‌టీ ధరలని తెలుస్తుంది. ఇది తప్పనిసరి. లేదంటే కఠిన చర్యలు తీసుకొంటాం. తొలుత రూ.25,000, రెండోసారి రూ.50,000 ఆ తర్వాత లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. అప్పటికీ మారకపోతే జైలుశిక్ష విధిస్తాం. ప్రారంభ దశలో జీఎస్‌టీ అమల్లో ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయి. ఫైనాన్స్‌, వినియోగదారుల సహా అన్ని మంత్రిత్వ శాఖలు వ్యాపారులు, వినియోగదారుల సమస్యలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి’ అని పాసవాన్‌ అన్నారు.

(223)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ