కాంగ్రెస్ హయాంలో కొనసాగిన ప్రభుత్వం రాజన్నరాజ్యం కాదని, రాబంధుల రాజ్యమని ఆనాటి నేతల ఇష్టారాజ్యమని, నాటి పాలనావైఫల్యాలను నేటికి ప్రజలు అనుభవిస్తున్నారని ఎమ్మెల్యే సతీష్ ప్రభాకర్ దుయ్యబట్టారు. తల్లి కాంగ్రెస్ హయాంలో జరిగిన లక్షల కోట్ల అవినీతి పునాదులపై కట్టిన ఘోరి 'జగన్ కాంగ్రెస్' అని, అవినీతి కేసుల్లో ఎ1 ముద్దాయిగా ఉన్న 'జగన్' ఎంతటి నీతి మంతుతో ప్రజలందరికి తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. 'జగన్'పార్టీలో ఉన్న నాయకుల్లో చాలా మంది ఏదో ఒక కేసులో నిందితులుగా ఉన్నారని సతీష్ విమర్శించారు. ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిక్షపాత్ర పోషించడంలో 'జగన్' ఘోరంగా విఫలమైన ఆయన అదుగో...ముఖ్యమంత్రిని అవుతా...ఇదుగో ముఖ్యమంత్రిని అవుతా అని అధికారులను బెదిరిస్తున్నారని, రాష్ట్రభివృద్ధికి నిరోధకులుగా తయారయ్యారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా 'జగన్' పార్టీని పునాదులతో సహా పెకలించి ప్రజలు నామ రూపాలు లేకుండా చేస్తారన్నారు.
అవినీతి, అక్రమాల్లో ఆరితేరిన 'జగన్' ఆయన దొంగల ముఠా సభ్యులకు కోర్టు జైలు/జైలు జీవిత విశేషాలు/దోచుకోవడం ఎలా/ ఆర్థిక నేరాలు ఎలా చేయాలో అనే పుస్తకాన్ని రచించి విడుదల చేయడానికి కావాల్సిన అర్హతలు 'జగన్'కు ఉన్నాయని, సిఎం చంద్రబాబును అవినీతి పరుడని విమర్శించడం పుస్తకాలు విడుదల చేయటం సరికాదని సతీష్ చెప్పారు. అవినీతి కొండ చిలువకు అండగా, అక్రమాలకు పాల్పడిన వారికి కేరాఫ్ అడ్రస్‌గా 'జగన్' పార్టీ ఉందని, వారు ఆయా కేసుల నుంచి ఎలా బయటపడాలని నిత్యం ఆలోచించుకోవడానికే సమయం సరిపోవడం లేదని, ఇక వారు ప్రజలకు ఏమి సేవ చేస్తారని 'అన్నం' ప్రశ్నించారు. నవ్యాంధ్రలో ఉన్న సమస్యాత్మక పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న సవాళ్లకు తమ నేత చంద్రబాబు ధీటైన జవాబు ఇవ్వడమే కాకుండా, రైతు రుణమాఫీ అమలు కాదన్న వారి నోరు మూయించారని, మా నేతపై అవాస్తవిమర్శలు, ఆరోపణలు చేస్తే మట్టికొట్టుకుపోతారని 'అన్నం' ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్న 'జగన్' ఇంత వరకు రాష్ట్రంలో పార్టీ కార్యాలయం కూడా లేదని నాడు కాంగ్రెస్ హయాంలో దోచుకున్న దోపిడీ దారులంతా 'జగన్' పార్టీలో చేరుతున్నారని 'అన్నం' విమర్శించారు.
క్షమించాలి మీరు వార్త మీద ఇష్టం లేదా వ్యతిరేకత ఇవ్వాలంటే మీరు లాగిన్ అయి ఉండవలెను .
LOGIN
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే ఇష్టపడి ఉన్నారు
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే వ్యతిరేకించి ఉన్నారు
అభిప్రాయాలూ