WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పికె' సర్వేలో 'రాజప్ప'కు ఎదురులేదు....!

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుండి 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖ పదవి నిర్వహిస్తున్న 'నిమ్మకాయల చినరాజప్ప' ప్రజల మనసును గెలుచుకుని దూసుకుపోతున్నారని ఆయనను ఎన్నికల్లో ఓడించడం చాలా కష్టమని 'జగన్‌' పార్టీ సలహాదారుడు రూపొందించిన నివేదికలో స్పష్టమైంది. ఈ నియోజకవర్గం నుండి ఎంత బలమైన నాయకుడ్ని ఎన్నికల బరిలోకి దింపినా వృధా ప్రయాసే తప్ప విజయం సాధించడం తప్పదని పికె నివేదికలో స్పష్టమైంది. నిజాయితీపరుడిగా,సౌమ్యుడిగా అన్ని వర్గాల్లో 'రాజప్ప' పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారని పార్టీ అధినేత 'చంద్రబాబు'కు అత్యంత వీరవిధేయుడని ఆయనను రామభక్త హనుమంతునిగా ఆ నియోజకవర్గ టిడిపి కార్యకర్తలు పోలుస్తున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులు, ఇతర ముఖ్యులు కూడా పెద్దాపురం నియోజకవర్గంలో అవినీతికి పాల్పడాలంటే జంకుతున్నారు. 

   రాజప్ప హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఆయన సన్నిహితులు బంధుమిత్రులు, ఇతర ముఖ్యులెవరూ అధికార దుర్వినియోగానికి పాల్పడడం లేదని క్రిందిస్థాయి అధికారులపై కానీ, ఉద్యోగులపై కానీ పెత్తనం చేయకుండా వారితో సౌమ్యంగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉండడమే కాకుండా అధికారపార్టీ నాయకుల పెత్తనం కానీ, రౌడీల బెదిరింపులు కానీ లేవు. ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి సారిగా విజయం సాధించిన 'రాజప్ప' ఏ వర్గంలో వ్యతిరేకత వ్యక్తం కాకుండా అన్ని వర్గాల ప్రజలతో కలసిమెలసి ఉంటున్నారు. 'ముద్రగడ' చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు తమ నాయకుడు మాత్రమే ధీటైన సమాధానం చెబుతున్నారని 'రాజప్ప' అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పెద్దాపురం నియోజకవర్గంలో 'రాజప్ప'కు గతంలో వచ్చిన మెజార్టీకన్నా మరింత ఎక్కువ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం. ఈ విషయాలన్నీ పికె నివేదికలో ఉన్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం. ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం కన్నా ఇతర నియోజకవర్గాలపై దృష్టిసారించడం మిన్నగా పికె చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పెద్దాపురం నియోజకవర్గంలో రాజప్పపై పోటీ చేసేందుకు ఏ ఒక్క నాయకుడికి ధైర్యం చాలడం లేదన్నది యదార్థం.

(213)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ