WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆర్టీసీని లాభాల్లోకి తేచ్చేందుకు కృషి చేస్తున్న 'శ్రీహరి'...!

నష్టాల బారి నుండి లాభాల బాటలోకి వస్తున్న ఆర్టీసీని మరింత బలోపేతం చేసి పూర్తిస్థాయిలో లాభాల బాటలో నడిపించాలన్న ఆ సంస్థ ఎండి మాలకొండయ్య ఆదేశాలకు అనుగుణంగా అనేక జిల్లాల్లో ఆర్‌ఎంలు రాత్రింభవళ్లు కష్టపడుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నష్టాల బారి నుండి లాభాల బాటలోకి వచ్చింది. ఈ విషయంలో మిగతా జిల్లాల కంటే గుంటూరు జిల్లా ముందంజలో ఉంది. ఆ సంస్థ జిల్లా స్థాయి అధికారి బాగా కష్టపడుతున్నారని పేరు తెచ్చుకున్నారు. నెలకు 20రోజులు తనిఖీలతో పాటు, పలు డిపోలను సందర్శించి ఏయే రూట్లల్లో ఆర్టీసీ నష్టాలు వస్తున్నాయో గమనించి అక్కడ ఉన్న అధికారులు, అనధికారులతో ఒక సమావేశం ఏర్పాటు ఆయా నష్టాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నారు గుంటూరు జిల్లా రీజనల్‌ మేనేజర్‌ జ్ఞానంగారి శ్రీహరి. ఇప్పటి వరకు అనేక డిపోలను సందర్శించి వాటిని ఆధునీకరించేందుకు శ్రీహరి కృషి చేశారు. కార్మికులందరూ సమిష్టిగా పనిచేసినప్పుడే ఆర్టీసి లాభాలబాట పడుతుందని ఏ ఒక్కరూ బాధ్యతారహితంగా వ్యవహరించినా మిగతా వారందరికీ చాలా నష్టమని పలు సమీక్షల్లో, సమావేశాల్లో శ్రీహరి ఆధారాలతో కొన్ని సంఘటనలను చెప్పడం జరిగింది. 

   ఇటీవల కాలంలో ఆ సంస్థ ఎండి మాలకొండయ్య గుంటూరు జిల్లాలోని వివిధ డిపోలను సందర్శించడం అక్కడ ఏర్పాటు చేసిన మరుగు దొడ్లను తనిఖీ చేయటం జరిగింది. గత సంవత్సరం రూ.831 కోట్లు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఈ సంవత్సరం ఏప్రిల్‌ నుండి ఇప్పటి వరకు నష్టాలు తగ్గి లాభాల్లోకి వచ్చిందని, ఈ విషయంలో మిగతా జిల్లాల కంటే గుంటూరు జిల్లా ముందుందని 'మాలకొండయ్య' దృష్టికి కార్మికులు తీసుకు వచ్చారు. గ్రామసభలు నిర్వహించడంలో మిగతా జిల్లాల కంటే గుంటూరు జిల్లా ముందంజలో ఉందని అనేక ప్రాంతాల్లో అధికారులు స్వయంగా పర్యటించి ప్రజాభిప్రాయలను తెలుసుకుని దానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని శ్రీహరి మీడియా వర్గాలకు తెలిపారు. కార్మికుల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నామో...ప్రజలు కూడా అదే స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నామని, బస్‌స్టాండ్లల్లో ఎంఆర్‌పి రేట్లకంటే అధికంగా అమ్మితే లైసెన్స్‌లు రద్దు చేస్తామని, ఇప్పటికే కొందరి లైసెన్స్‌లు రద్దు చేయడం జరిగిందని శ్రీహరి తెలిపారు. 

   ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయస్సును 60కి పెంచాలని తాను అధికారుల సంఘం తరుపున రవాణ మంత్రి అచ్చెంనాయుడును కలసి విన్నవించానని మరి కొద్ది రోజుల్లో అధికార నిర్ణయం వెలువడడం ఖాయమని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నారని శ్రీహరి చెబుతూ ఈ విషయంలో ఆయన అధికారుల సంఘం తరుపున ధన్యవాదాలు తెలిపారు. మిగతా ప్రభుత్వ రంగ సంస్థల వయోపరిమితి పెంచినట్లే...ఆర్టీసీ కూడా పెంపు తప్పనిసరిగా వస్తుందని కార్మికులు కూడా నమ్ముతున్నారు.గుంటూరు జిల్లాలో అనేక డిపోల్లో చాలా సమస్యలు పరిష్కరించామని, అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ప్రయాణీకుల భద్రతకు, కార్మికుల సంక్షేమానికి, 13 డిపోల్లో బస్‌ కొరకు వేచి ఉంటే సమయంలో కూర్చోవడానికి కుర్చీలు, బస్‌స్టాండ్‌లో మంచినీటి సౌకర్యం, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వసతులు అందుబాటులో ఉంచాలని, ఆర్టీసీలో ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచి మంచి కండిషన్లలో ఉన్న బస్సులను ప్రవేశపెట్టామని తెలిపారు. ఆర్టీసీ సంస్థ బతికి బట్టకట్టాలంటే లాబాల బాటకు వచ్చేటప్పుడే అటు ప్రజలకు, ఇటు కార్మికులకు మంచి జరుగుతుందన్నారు శ్రీహరి. 

  ఇప్పుడు అనేక వర్గాలకు సదుపాయాలు కల్పించామని, కార్మికులకు కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టడం లేదని, చిన్న తప్పులకు పెద్ద శిక్షలు వేయటం తన అభిమతం కాదని శ్రీహరి చెబుతున్నారు. ఇదే విషయంపై పలువురు కార్మికులను గుంటూరు బస్‌స్టాండ్‌లో 'జనం ప్రత్యేక ప్రతినిధి' స్వయంగా ప్రశ్నించగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని బతికించుకుంటామని ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని, ఆర్టీసీ బస్సుల్లో వారు ప్రయాణించినప్పుడే ఇది సాధ్యం అవుతుందని వారు చెప్పారు. తమ ఆర్‌ఎం ఇంత వరకు ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టడం లేదని, గతంలో చిన్న తప్పులకు పెద్ద శిక్షవేసేవారని, సస్పెండ్‌ అయిన ఉద్యోగికి మళ్లీ ఉద్యోగం ఇవ్వాలంటే నెలల సమయం పట్టేదని, సర్వీసు నుంచి తొలగించిన వారికి సంవత్సరాల సమయం పట్టేది..ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు..చిన్న కారణాలతో సస్పెండ్‌ అయినా సర్వీసు నుంచి తొలగించినా కేవలం రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తున్నారని దీనికి ముఖ్యకారకులు శ్రీహరి అని కార్మికులు చెబుతున్నారు. ఆర్టీసీ సంస్థ బాగుండాలంటే అటు ప్రజలు...ఇటు మీడియా వర్గాలు సహకరించినప్పుడే సాధ్యపడుతుందని ఆ రెండు వర్గాలు తమ సంస్థపై కనికరం చూపాలని పలువురు కార్మికులు కోరుతున్నారు. ఈ విషయంలో మీడియా బాగా సహకరిస్తున్నప్పటికీ ప్రజలు పూర్తి స్థాయిలో ఆర్టీసీ వైపు మళ్లడం లేదని వారి చూపు తమ సంస్థపై మళ్లినప్పుడు వందల కోట్ల నష్టాల నుండి బయటపడడమే కాకుండా లాభాలబాటలో నడవడం ఖాయమని ప్రజలు కూడా సంస్థపై ప్రత్యేక దృష్టిసారించి సహకరించాలని కోరారు.

(482)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ