WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రత్యేక హోదాపై హామీ ఇవ్వలేదేం...!

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉన్నా...అప్పుడే ఎన్నికల హామీలు కురిపిస్తూ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణాన్ని సృష్టించారు ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌. నిన్న గుంటూరులో జరిగిన వైకాపా ప్లీనరీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అది చేస్తాం..ఇది చేస్తాం...మళ్లీ రాజన్నపాలన తెస్తాం...మరో ముప్పయేళ్లు సిఎంగా ఉంటాను...అంటూ చాంతాడంత లిస్ట్‌ చదివారు 'ఆయన'. ఇచ్చిన హామీలు అమలు చేసే బడ్జెట్‌ రాష్ట్రానికి లేదని.. తెలిసినా...గెలిచిన తరువాత చూసుకుందాం..అన్నట్లు హామీల వర్షం కురిపించారు. అయితే ఆయన ఇచ్చిన హామీలపై ఇప్పటికే ప్రజల్లో చర్చ జరుగుతుండగా....ఇన్ని హామీలు ఇచ్చిన ఆయన రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై హామీ ఎందుకు ఇవ్వలేదని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు అధికార తెలుగుదేశం పార్టీ ప్రత్యేకహోదా సాధించలేదంటూ ఇంటా...బయటా ఒకటే గొడవ చేస్తూ రాద్దాంతం సృష్టిస్తున్న ఆయన ఈ ప్లీనరీలో కానీ...తరువాత తాను చేసిన హామీల్లో కానీ 'హోదా' విషయాన్ని ఎందుకు చేర్చలేదని వారు నిలదీస్తున్నారు.

   గతంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం తమ పార్టీ ఎంపీలందరూ జూలైలో రాజీనామా చేస్తారని చెప్పిన ఆయన ఇప్పుడు ఆ విషయమే లేదన్నట్లు వ్యవహరించడం విశేషం. మాట తప్పం...మడమ తిప్పని వంశం అని చెప్పే 'జగన్‌' ప్రత్యేకహోదాపై ప్లీనరీలో మాట మాత్రమైనా స్పందించకపోవడం ఏమిటి...? తాను అధికారంలోకి వస్తే...చేస్తానన్న హామీల్లోనైనా దాన్ని ఎందుకు చేర్చలేదు...! 'ప్రత్యేకహోదా' అంటే 'మోడీ' కోపం వస్తుందనా...? 'మోడీ'కి కోపం వస్తే....తనపై ఉన్న కేసులు ఆగమేఘాలపై కదలి మళ్లీ జైలుకెళ్లాల్సి వస్తుందన్న భయమా...!? నిన్నటి దాకా అధికార టిడిపి పెద్ద ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని 'ప్రత్యేకహోదా'ను ఢిల్లీకి తాకట్టు పెట్టారని విమర్శించిన 'జగన్‌' ఇప్పుడు...తాను కూడా కేసుల భయంతోనే 'హోదా' గురించి ప్రస్తావించడానికే భయపడ్డానని చెబుతారా...! తనదాకా...వస్తే...కానీ అంటారే...! అఉంది 'జగన్‌' వ్యవహారం. ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ విశాఖవిమానాశ్రయంలో ఆడిన డ్రామా...గుంటూరు ప్లీనరీలో ఎందుకు ఆడలేదని అధికారపక్షం ప్రశ్నిస్తోంది.


(213)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ