WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కలెక్టర్లను ఆదేశిస్తున్న సిఎంఒ అధికారి సతీమణి....!

ముఖ్యమంత్రి కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారుల్లో ఒక అధికారి కుటుంబసభ్యులొకరు...జిల్లాస్థాయి అధికారులకు, కలెక్టర్లకు స్వయంగా ఫోన్‌చేసి పనులు చక్కపెట్టాలని హుకూం జారీ చేస్తున్నారట. అఆదేశాలు జారీ చేస్తుంది ఎవరో కాదు..ఆ ఆదేశాలు జారీ చేస్తోంది ఒక అధికారి సతీమణి అట. ఏయే అధికారులకు, ఏయే కలెక్టర్లకు ఫోన్లు చేసి పనులు చక్కపెట్టారో తెలియకపోయినా...అనేక పనులు చక్కపెట్టారనేది విశ్వసనీయవర్గాల సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగే ఒక జిల్లా కలెక్టర్‌కు ఆమె స్వయంగా ఫోన్‌ చేసి తాను సిఫార్సు చేసిన పనులను చేసిపెట్టాలని కోరటం జరిగింది. దీంతో ఆందోళన చెందిన ఆ కలెక్టర్‌ మళ్లీ ఫోన్‌చేస్తే మర్యాద దక్కదని హెచ్చరించారట.అంతే కాకుండా ముఖ్యమంత్రిని స్వయంగా కలసి ఫలానా అధికారి సతీమణి తనకు ఫోన్‌చేశారని తాను ఈ విధంగా సమాధానం చెప్పానని, ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నానని ఆయన చెప్పారట. ఈ విషయం బయటకు పొక్కనీయవద్దని మళ్లీ ఆమె ఫోన్‌ చేయకుండా తాను చూసుకుంటానని...మీరు ఏ ఒక్కరినీ ఖాతరు చేయవద్దని ఆ కలెక్టర్‌కు సిఎం చెప్పారట. తరువాత సంబంధిత అధికారిని ముఖ్యమంత్రి స్వయంగా పిలిచి సున్నితంగా మందలించడమే కాకుండా...మనం ఎటుపోతున్నాం...నీ భార్య ఏమిటి...? అధికారులకు ఫోన్లు చేయటం...ఏమిటి...? ఇంతకు ముందు ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరగలేదు. ఇది నాదృష్టికి మాత్రమే వచ్చింది...జాగ్రత్త...మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దని హెచ్చరించారట.

  తన భార్య ఫలానా అధికారికి ఫోన్‌ చేస్తున్న విషయం ఆ అధికారికి తెలుసో తెలియదో కానీ...చంద్రబాబు పెట్టిన చివాట్లకు తలదించకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేయటం జరిగింది. తనపై ఫిర్యాదు చేశారని తనను బదిలీ చేశారా...? లేక వేరే కారణాలతో బదిలీ చేశారా...? అనేది ఆ అధికారి అంతుబట్టలేదు. ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తోన్న అధికారి భార్య ఈ విధంగా సాహసించి ఫోన్లు చేయటం ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. అవినీతి పరులపై ఉక్కుపాదం మోపుతాం...అని పదే పదే ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పే చంద్రబాబు తన కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేసిన అదికారులు వారి అంతరంగిక సిబ్బందిపై రహస్యంగా విచారణ జరిపిస్తే వాస్తవాలన్నీ బయటపడడమే కాకుండా...సగం మందికి ఉద్వాసన తప్పదు. ఒకవైపు 'జగన్‌' అవినీతిపై ఒంటికాలిపై విమర్శలు చేస్తున్న 'చంద్రబాబు, చినబాబు'లు తమ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అంతరంగిక సిబ్బందిలో ఎక్కువ మంది ఆయన వ్యతిరేకులే కాకుండా...కాబోయే సిఎం 'జగన్‌బాబు' అని చెప్పుకుంటున్నారట. ముందుగా సిఎం కార్యాలయాన్ని ప్రక్షాళన చేసుకుంటేనే మిగతా వ్యవహారాలు గాడిన పడుతాయని వివిధశాఖాధిపతులు అంటున్నారు.

(418)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ