కార్పొరేట్‌ కంపెనీగా 'జగన్‌' పార్టీ: అన్నం 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కార్పొరేట్‌ కంపెనీగా 'జగన్‌' పార్టీ: అన్నం

రాజకీయ పరిపక్వత, ప్రజాశ్రేయస్సు పట్ల ఏ మాత్రం  నిబద్దత లేని వై.ఎస్‌.జగన్‌ ఆయన స్థాపించిన పార్టీ ప్రజాస్వామ్య పద్దతిలో నడవడం లేదని, కార్పొరేట్‌ కంపెనీలా రూపాంతరం చెందిందని తెలుగుదేశం పార్టీ దుయ్యబట్టింది. ప్రజాసేవ చేయడానికి కనీస అర్హత వై.ఎస్‌.జగన్‌ లేవని తన వ్యాపార మనస్వత్త్వ కార్పొరేట్‌ కంపెనీగా టిడిపి పేర్కొంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ బాపట్ల టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి 'అన్నం సతీష్‌ప్రభాకర్‌' విలేకరులతో మాట్లాడుతూ ఎటువంటి క్లిష్టపరిస్థితులైనా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం అన్నింటికి మించిన అపార అనుభవం ఉన్న ఏకైక నేత 'చంద్రబాబునాయుడు' అని ఆయన విమర్శలు, ఆరోపణలు చేయడం అంటే, ఆకాశం వైపు చూపి ఉమ్మి వేయడమేనని 'అన్నం' విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల పేర్లు మార్చి తొమ్మిది నూతన హామీలంటూ 'జగన్‌' అర్థం లేని హడావుడి చేస్తున్నారని 'అన్నం' దుయ్యబట్టారు. రైతు రుణాలమాఫీ అసాధ్యమని చెప్పిన 'జగన్‌' ఆ తరువాత చంద్రబాబు రుణమాఫీని అమలు చేసి చూపించారని ఏ ముఖంతో ఆయన మాట్లాడుతున్నారని అన్నం ప్రశ్నించారు. ఒకవేళ 'జగన్‌'కు చిత్తశుద్ది ఉంటే 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎందుకు ప్రతిపాదించలేదో చెప్పాలని 'అన్నం' డిమాండ్‌ చేశారు. 'జగన్‌' పార్టీ ప్లీనరీ సమావేశాల తీరుతెన్నులు పరిశీలిస్తే అత్యంత హాస్యాస్పదంగా , అపరిపక్వంగా ఉందని ఏ పదవీ హోదాలేని కార్పొరేట్‌ కాంట్రాక్టర్‌ 'ప్రశాంత్‌ కిశోర్‌'ను చూపించి పార్టీ నేతలను పరోక్షంగా బెదిరించారని, అంతేకాకుండా 'చంద్రబాబు'ను పదే పదే తిట్టాలని 'రోజా'కు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెవిలో చెప్పడాన్ని వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమన్నారు. ప్రజాసేవ చేయడానికి కావాల్సిన నిబద్దత సరైన నిర్ణయాలు తీసుకోగలిగిన స్థిరత్వం 'జగన్‌'లో కనిపించడం లేదని, అత్యంత చంచలమైన స్వభావిగా ఆయన ఉన్నారని ఆయనకు చంచలగూడ జైలే సరైన స్వార్థమని 'సతీష్‌ విమర్శించారు. స్వతాగా నిర్ణయాలు తీసుకునే 'జగన్‌' అవాస్తవ విమర్శలు, ఆరోపణలు, పిల్లచేష్టలు మానుకోవాలని ప్రజాసంక్షేమంపై అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారని ఆయన వ్యాఖ్యానించారు. వ్యాపారాలు తప్ప రాజకీయాలను పట్టించుకోని తమ నేత భార్య 'నారా భువనేశ్వరి'పై 'జగన్‌' సోదరి షర్మిల ప్లీనరీ సమావేశాల్లో ప్రస్తావించే అర్హత ఆమెకు లేదని ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ముందు ఆమె తన ఇల్లును చక్కదిద్దుకొని ఎదుటి వారిపై విమర్శలు చేయాలని ఆయన సలహా ఇచ్చారు.సిఎం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు సామాన్య ప్రజలకు అందుతున్నాయని, ఆ పథకాలనే తన పథకాలుగా 'జగన్‌' హామీలుగా చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ఆయన ప్రతిపక్షనేత పాత్రను సమర్థవంతంగా నిర్వహించి స్వపక్షీయుల మన్నలను పొందాలని ఆయన ముఖ్యమంత్రి కావడం కల్ల అని మరో ముప్పయి సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వమే రాష్ట్రంలో ఉంటుందని ధీమా 'అన్నం' వ్యక్తం చేశారు.

(538)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ