WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

3,500 అశ్లీల వెబ్‌సైట్ల బ్లాక్

చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న 3,500 అశ్లీల వెబ్‌సైట్లను బ్లాక్ చేశామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. పాఠశాలల్లో జామర్లు ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈని కోరామని కోర్టుకు కేంద్రం చెప్పింది. పాఠ‌శాల వ‌ర‌కు జామ‌ర్లు ఏర్పాటు చేయ‌డం కుదురుతుంది కానీ స్కూల్ బ‌స్సుల్లో కూడా జామ‌ర్ల ఏర్పాటు చేయ‌డం వీలు కాదు.. దీనిపై ఏదో ఒక ప‌రిష్కారాన్ని త్వ‌ర‌లో రూపొందిస్తాం` అని అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ పింకీ ఆనంద్ ధ‌ర్మాసనంతో చెప్పారు. అయితే అశ్లీల వెబ్‌సైట్ల ఏరివేత‌కు సంబంధించిన రిపోర్టును రెండ్రోజుల్లోగా ప్ర‌వేశ పెట్టాల‌ని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.

(49)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ