'జగన్‌'...'చంద్రబాబుగారు'...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌'...'చంద్రబాబుగారు'...!

ఆయనకు మొదటి పేర్కొన్న వ్యక్తి అధినేత...రెండో వ్యక్తి తమ పార్టీకి బద్ధశత్రువైన వ్యక్తి....! తమ అధినేతను ఏకవచనంతో సంబోధించగా...తమ శత్రువును గౌరవంగా పిలవడం ఇప్పుడు వైకాపా నాయకుల్లో తీవ్ర చర్చకు కారణం అయింది. ఇంతకీ ఈ విధంగా చెప్పింది ఎవరో చిన్న స్థాయి నాయకుడు కాదు...! పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. ఇటీవల గుంటూరులో నిర్వహించిన వైకాపా ప్లీనరీ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. సినీనటి,ఎమ్మెల్యే రోజా ప్లీనరీలో ప్రసంగించే ముందు 'ఆమె'తో 'ఉమ్మారెడ్డి' గుసగుసలాడారు. అయితే వారు గుస గుస లాడుకున్నారని వారిలో వారు అనుకున్నా....మైక్‌ ఆన్‌ చేసి ఉండడంతో 'ఉమ్మారెడ్డి' 'రోజా'తో సంభాషించిన మాటలు ఒక్కసారిగా సభలో సభికులితో పాటు...టివీల ముందు ఉన్న ప్రేక్షకులకు చేరిపోయాయి. దీంతో అవాక్కు అవడం అటు ప్లీనరీకి వచ్చిన వారి వంతు...ఇటు టీవీ ప్రేక్షకుల వంతైంది.

   అసలు ప్లీనరీ సందర్భంగా 'ఉమ్మారెడ్డి' 'రోజా' మధ్య జరిగిన సంభాషణలో తమ నేత ఏ విధంగా వారు అగౌరపరిచారో మొదట వైకాపా నేతలకు, కార్యకర్తలకు అర్థం కాలేదు. మైక్‌ ముందుకు వచ్చిన 'రోజా'తో 'ఉమ్మారెడ్డి' మాట్లాడుతూ 'అమ్మాయి...'జగన్‌' బాగా తిట్టమంటున్నారు...తిట్టు....! అని చెప్పారు..దీనికి 'రోజా' స్పందిస్తూ...'ఎవరిని తిట్టాలి...! అని ఎదురు ప్రశ్నించగా మరోసారి 'ఉమ్మారెడ్డి' స్పందిస్తూ ''జగన్‌' 'చంద్రబాబుగారి' తిట్టమంటున్నారు...బాగా తిట్టు...! అని చెప్పారు. దీనిలో తనకు అధినేత అయిన 'జగన్‌'ను ఏకవాచకంలో సంబోధించగా..తమ ప్రత్యర్థి 'చంద్రబాబు'ను 'గారూ' అని సంభోధించారు. తమ మాజీ అధినేత 'చంద్రబాబు'పై ఇప్పటికీ ఆయనకు గౌరవం తగ్గలేదని వైకాపా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా గౌరవం అనేది వ్యక్తిని బట్టి సహజంగా బయటకు వస్తుందంటారు...'చంద్రబాబు' 'జగన్‌' విషయంలో అదే నిజమైంది.


(328)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ