గుంటూరులో లక్ష క్యాట్‌ కార్డులు టార్గెట్‌...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గుంటూరులో లక్ష క్యాట్‌ కార్డులు టార్గెట్‌...!

ఆర్టీసీ సంస్థను లాభాలబాటలో నడిపించేందుకు తమ ప్రయాణీకులను ఆర్టీసీ బస్సుల వైపే ఆకర్షించేందుకు ఆ సంస్థ సీనియర్‌ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు లక్ష క్యాట్‌ కార్డులను అందించే దిశగా గుంటూరు జిల్లాకు చెందిన ఆర్టీసీ అధికారులు టార్గెట్‌లు పెట్టుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో లక్ష క్యాట్‌ కార్డులను ప్రయాణీకులకు అందించాలని ఆ సంస్థ రీజనల్‌ మేనేజర్‌ శ్రీహరి ఇటీవల జరిగిన అధికారుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఇప్పటికే లక్షల్లో నష్టాల్లో ఉన్న కొన్ని డిపోలు లాభాల బాట పడుతున్నాయి. వినుకొండ డిపో ఇంతకు ముందు రూ.34లక్షల నష్టాల్లో ఉండగా ప్రస్తుతం రూ.10లక్షల లాభాలబాటలో నడుస్తుంది. ఇంతకు ముందు కోట్లలో వచ్చిన నష్టాన్ని తగ్గించి లక్షల్లోకి తేగలిగారు అధికారులు. రెండు సంవత్సరాల్లో చేసిన కృషి వలన ఇది సాధ్యపడిందని, దీనికంతటికి శ్రీహరి కృషేనని పలువురు డిపో మేనేజర్లతో పాటు ఇతర ముఖ్య అధికారులు చెబుతున్నారు.రాష్ట్రంలో రోజుకు 65లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుండగా గుంటూరు జిల్లాల్లో 6.5లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. దీనిలో ఎక్కువమందికి క్యాట్‌ కార్డు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో వివరిస్తున్నారు. 

   2018 మార్చిలోగా లక్ష క్యాట్‌కార్డులు పంపిణీ చేయాలనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆర్‌ఎం శ్రీహరి సూచించారు. క్యాట్‌ కార్డుల అమ్మకంలో డిపో మేనేజర్లు పోటీ పడాలని ఎవరు ఎక్కువ క్యాట్‌ కార్డులను అమ్మితే వారికి అవార్డులు ఇస్తామని శ్రీహరి చెప్పారు. పలు డిపోల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఇతర అధికారులు కూడా ఎసి రూంలకు, కార్యాలయాలకు పరిమితం కాకుండా స్వయంగా ప్రయాణీకుల దగ్గరకు వెళ్లాలని శ్రీహరి ఆదేశించడం జరిగింది. ఇప్పటికే గుంటూరు జిల్లాల్లో పలు బస్‌స్టాప్‌లలో క్రింది స్థాయి అధికారులు, ప్రయాణీకులను దగ్గర ఉండి బస్సులను ఎక్కిస్తున్నారు.యూనియన్‌ నాయకులు కూడా ఇగోలను పక్కనపెట్టి కష్టపడి పనిచేయాలని, ఎవరైనా సరే బాధ్యతలు నిర్వహించి సంస్థను మరింత లాభాలబాటలోకి నడిపించాలని  శ్రీహరి సమీక్షా సమావేశంలో చెప్పడం జరిగింది. ఇంత వరకు యూనియన్‌ కార్యక్రమాలకే పరిమితమైన కొందరు నాయకులు ఇంతకు ముందు ఏహోదాలో ఉన్నారో ఆ బాధ్యతలను తాజాగా నిర్వహిస్తున్నారు.ఆర్టీసీ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. 

  గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే పలు డిపోలు లాభాలబాటలో నడుస్తున్నాయని, డిసెంబర్‌ నాటికి అన్ని డిపోలు లాభాలబాటలోకి రావాలని, దీనికి ప్రతిఒక్కరు కృషి చేస్తేనే సాధ్యపడుతుందని ఈ విషయాన్ని సమీక్షా సమావేశంలో సంస్థ ఎండి మాలకొండయ్య చెప్పడం జరిగిందని, దీని గురించి తనను కలిసేందుకు వచ్చేవారికి శ్రీహరి చెబుతున్నారు. లక్షకు పైగా క్యాట్‌ కార్డులను ప్రయాణీకులను అందించగలిగితే అవార్డులతో పాటు, రివార్డులు కూడా వస్తాయని మనలను చూచి ఇతర జిల్లాల అధికారులు ఆదర్శంగా తీసుకుంటారని, బాద్యతలు నిర్వహించడంలో ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా ఉండవద్దని ఇటీవల జరిగిన సమావేశంలో శ్రీహరి చెప్పారు. తాను నెలకు 20రోజులు వివిధ ప్రాంతాల్లో స్వయంగా పర్యటించడమే కాకుండా డిపో మేనేజర్లు తమ ప్రాంతాల్లో పర్యటించే విధంగా శ్రీహరి ఆదేశాలు జారీ చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఆయన కార్యాలయంలో ఉంటూ మిగతా వారిని కూడా కష్టపడి పనిచేయిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు నష్టాల బాటలో నడిచిన కొన్ని డిపోలు లాభాలబాటలో నడవడంలో గుంటూరు జిల్లా రీజనల్‌ మేనేజర్‌తో పాటు ఇతర అధికారులను ఉన్నతాదికారులతో పాటు అధికార,ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు కూడా ఆర్‌ఎంను అభినందిస్తున్నారు.

(356)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ