WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'గంటా' పిఎస్‌ 'నాయుడు' అవినీతిపై ఎసిబి దృష్టి...!

విద్యాశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు అంతరంగిక అధికారిగా బాద్యతలు నిర్వహిస్తున్న 'నాయుడు'పై ఎసిబి అధికారులు దృష్టిసారించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కానీ, ఇతర ముఖ్యులు కానీ ఎటువంటి సిఫార్సులు చేసినా 'నాయుడు' చేయి చాపుతూనే ఉన్నారట. లంచాలు ఇస్తే గంటల్లో పనిచేస్తారట...ఇవ్వకుంటే కొన్ని రోజులు తిప్పించుకుంటారట. తాము చేసిన సిఫార్సులకు కూడా 'నాయుడు' లంచాలు తీసుకుంటున్నారనే సంగతి తెలిసి సిఎంఒ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు మంత్రి కార్యాలయంలో అంతరంగిక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ, మరో వైపు రాజీవ్‌విద్యామిషన్‌లో ఇన్‌ఛార్జి చీఫ్‌ ఇంజనీర్‌గా బాద్యతలు నిర్వహిస్తూనే ఉన్నారు. మంత్రుల పేషిలో వివిధ హోదాల్లో ఎంతో మంది అధికారులు పనిచేస్తుండగా విద్యాశాఖ మంత్రి గంటా అంతరంగిక అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఇంతకు ముందు ఏ ఒక్కరిపై రాలేదని ఆయన దూకుడును మంత్రి ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారనే ప్రశ్న తలెత్తుతుంది. నిర్వహిస్తున్నశాఖలో ఇంత వరకు అవినీతి మచ్చ అంటని 'గంటా' తన అంతరంగిక అధికారిని ఎందుకు తొలగించలేకపోతున్నారు.

   దేవుడు వరమిచ్చినా..పూజారి సహకరించలేదనే సామెతగా 'నాయుడు' వ్యవహారశైలి ఉంది. గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేసినప్పుడు జరిగిన అవకతవకలు, అక్రమాలపై విచారణ ఎదుర్కోబోతున్నారు 'నాయుడు'. ఇప్పటి వరకు ఈ 'నాయుడు' వ్యవహారం సిఎం చంద్రబాబు దృష్టికి ఏఒక్కరూ తీసుకెళ్లలేదు.'నాయుడు'ను మీ కార్యాలయం నుంచి తప్పించాలని 'గంటా'కు సూచించినట్లు బయటకు పొక్కింది. గిరిజనశాఖ ఇంజనీరింగ్‌లో జరిగిన అవకతవకలు, అక్రమాలతో పాటు తాజాగా మంత్రి కార్యాలయంలో జరిగిన అక్రమాలపై విచారిపితే వెలుగులోకి రాని వాస్తవాలు బయటకు వస్తాయి. 'నాయుడు' సంపాదించిన ఆస్తులపై ఎసిబి చర్యలు తీసుకోగలిగితే కొన్ని కోట్ల ఆస్తులు బయటపడడం ఖాయమని ఇంజనీర్లుతో పాటు విద్యాశాఖలో పలుహోదాల్లో పనిచేసిన అధికారులు ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం మంత్రి కార్యాలయానికి వచ్చే సందర్శకులను ఆయన ఊరికే ఒదలడం లేదట.ప్రతిపనికి ఒక రేటును ఫిక్స్‌ చేయటంలో మంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న మరో ఉద్యోగి 'నాయుడు'కు మధ్యవర్తి పాత్ర నిర్వహిస్తున్నారట. స్వామి కార్యాయంతో పాటు స్వకార్యం గురిశిష్యులిద్దరూ నెరవేర్చుకుంటున్నారు. 'నాయుడు' అవినీతి వ్యవహారం గురించి మంత్రికి తెలిసినప్పటికి ఆయన మౌనం వహించడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గిరిజనసంక్షేమశాఖలోని ఉన్నతాధికారి కూడా 'నాయుడు' చేసిన అక్రమాలు బయటకు రాకుండా తెరవెనుక ఉండి సహాయ,సహకారాలు అందిస్తున్నారు. 'నాయుడు'కి గిరిజనశాఖ లోని అధికారి భారీ ఎత్తున్న లంచాలు ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఉన్నతాధికారి, నాయుడు కలిసి పంచుకుంటున్నారని అక్కడ ఉద్యోగులు బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని ఒక ఉన్నతాదికారి ఒకరు ప్రయత్నిస్తున్నారు. త్వరలో 'నాయుడు' పాపం పండక తప్పదని ఆయన బాధితులైన కొందరు అధికారులు, ఉద్యోగులు చెబుతున్నారు. మీడియా వర్గాలు కూడా 'నాయుడు' అవినీతిపై దృష్టిసారించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


(241)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ