WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నిజాయితీకి,సమర్థతకు, విధేయతకు పెద్దపీట...!

సీనియర్‌ ఐఎఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల్లో నిజాయితీకీ,సమర్థతకు, ప్రభుత్వం పట్ల విధేయతకు గుర్తింపు ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా పనిచేయని అధికారులను అప్రాధాన్యత పోస్టులకు బదిలీ చేయటం జరిగింది. పిఆర్‌ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డికి అదనంగా గ్రామీణాభివృద్ధిశాఖను కేటాయించడంపై విమర్శలతో పాటు, దేవాదాయశాఖాధిపతి పదవి నుండి జె.ఎస్‌.వి.ప్రసాద్‌ను తప్పించడంపై రాజకీయ, అధికార, ఉద్యోగవర్గాలు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాయి. నిజాయితీ,సమర్థతోపాటు, పాలకులకు విధేయత, కష్టపడి పనిచేసే తత్వం కల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న 'మన్మోహన్‌సింగ్‌'కు ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'దినేష్‌కుమార్‌' సిఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చందర్‌లు కూడా పూర్తిస్థాయి మద్దతు ఇచ్చి ఆయనకు రెవిన్యూశాఖతో పాటు డిజార్ట్‌మెంట్‌ మరియు దేవాదాయశాఖాధిపతిగా నియమించడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత వివిధ శాఖాధిపతులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఎఎస్‌ అధికారుల్లో అతి కొద్ది మంది మాత్రమే రాత్రింభవళ్లు కష్టపడి పనిచేయడమే కాకుండా ప్రభుత్వ ప్రతిష్టను పెంచారు. 

  కుల,మత,ప్రాంతాలకు అతీతంగా అప్పగించిన బాధ్యతలను నిర్వహించడం జరిగింది. ప్రభుత్వానికి పూర్తిస్థాయి అభినందనలు కేంద్రస్థాయిలో వెల్లడైయ్యాయంటే అందుకు కారణం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి 'దినేష్‌కుమార్‌'తో పాటు డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ల కృషి ఎంతో ఉంది. పశుసంవర్థశాఖకు కేంద్రస్థాయిలో నిధులు సాధించడానికి 'మన్మోహన్‌సింగ్‌' కృషి చేశారు. మన్మోహన్‌కు అన్నిశాఖల బాధ్యతలు అప్పచెబుతారని ఆయనతో పాటు ఏ ఒక్క అధికారి కూడా ఊహించలేకపోయారు. నిజాయితీగా, సమర్థవంతంగా, పాలకులపట్ల విధేయతతో పనిచేస్తే గుర్తింపు లభిస్తుందని 'దినేష్‌కుమార్‌,మన్మోహన్‌సింగ్‌'లు రుజువు చేశారు. 'దినేష్‌కుమార్‌' ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవుతారని రాజకీయ, అధికార వర్గాల్లో ఎక్కువ మందికి నమ్మకం లేదు. అతి కొద్దిమంది మీడియా ప్రతినిధులతోపాటు కొందరు అధికారులు మాత్రమే ఆయన ప్రధాన కార్యదర్శి అవుతారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 'నరేగా' పథకాన్ని గ్రామస్థాయిలో అమలు చేయడంతో ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి లభించింది. అదే విధంగా నిజాయితీగా, సమర్థవంతగా బాధ్యతలు నిర్వహించిన 'మన్మోహన్‌సింగ్‌'కు కీలకమైన శాఖలు లభించాయి. వీరిద్దరూ అత్యంత నిజాయితీపరులని గుర్తించిన 'చంద్రబాబు' వారిద్దరికి గుర్తింపు ఇవ్వడంలో జాప్యం చేసినా చివరకు ఎవరూ ఊహించనంత గుర్తింపు ఇచ్చి అందరి అభినందనలు పొందారు. ముప్పయి ఏళ్లకు పైగా బాద్యతలు నిర్వహించిన 'దినేష్‌కుమార్‌, మన్మోహన్‌సింగ్‌'లు ఏనాడూ అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు వార్తలు రాలేదు. అవినీతిని అంతం చేస్తానంటున్న 'చంద్రబాబు' ఈ ఇద్దరు అధికారుల నియామకంతో తాను మాటపై నిలబడే ముఖ్యమంత్రిగా రుజువు చేసుకున్నారు. 

  నిజాయితీ,సమర్థత ఉన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్‌.వి.సుబ్రహ్మణ్యంకు తగిన గుర్తింపు ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించడం లేదట. ఆయనపై వ్యక్తిగత కోపం ఎంత వరకు చంద్రబాబుకు ఉందో కానీ, అధికార హోదాలో ఎల్‌.వి. ఏనాడూ ఎటువంటి తప్పు చేయలేదని అధికారులు చెబుతున్నారు. ఎల్‌.వి అహంకారధోరణితో మాట్లాడతారనే విమర్శ ఉంది. ఎక్కువ మంది రాజకీయ,అధికార, ఉద్యోగ వర్గాలు ఎల్‌.వి.ని ఇగోస్టుగా అభివర్ణిస్తుంటారు. అంతే కానీ...ఆయన నిర్వహించిన ఏ శాఖలోనూ అవినీతికి పాల్పడినట్లు ఎవరూ ఆరోపణలు చేయలేదు.ఏదో విధంగా ఆయనకు కూడా గుర్తింపు కలిగిన పోస్టు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'దినేష్‌కుమార్‌' ఆలోచన. గతంలో టిటిడి ఇఒగా 'ఎల్‌.వి' బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ప్రతిపక్షహోదాలో 'చంద్రబాబు' తిరుపతి వెళ్లినప్పుడు ఆ సమయంలో అక్కడే ఉన్న 'ఎల్‌.వి' 'చంద్రబాబు'ను కలిసేందుకు ఇష్టపడలేదని ప్రచారం జరిగింది. అదే కారణంతో ఆయనను 'చంద్రబాబు' పక్కనపెడుతున్నారా...? మరే ఇతర కారణాలు ఆయన మనస్సులో ఉన్నాయన్న విషయం 'చంద్రబాబు' బయటపెట్టడం లేదు. కానీ అప్పట్లో జెఇఒగా బాద్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసరాజు కూడా 'చంద్రబాబు'కు ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వకుండా ప్రొటోకాల్‌ కూడా పాటించలేదు. అయితే ఆయన ఇప్పటికీ తిరుమల జెఇఒగా ఇప్పటికీ కొనసాగుతున్నారు. కేవలం ఇగోస్టుగా 'ఎల్‌.వి'పై ముద్ర ఉంది కానీ...ఇతర ఆరోపణలు ఏమీ లేవు. ఈ అధికారి పట్ల 'చంద్రబాబు' కోపతాపాలు మాని, ఆయన హోదాకు గుర్తింపు ఇస్తే సిఎం ప్రతిష్ట మరింత పెరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.


(353)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ