WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పూరీ ఫై సిట్ అధికారుల ప్రత్యేక దృష్టి

ప్రముఖ దర్శకుడుపూరీ జగన్నాధ్‌ను డ్రగ్స్ కేసు వెంటాడుతోంది. పూరీని సిట్ కార్యాలయంలో విచారించిన అనంతరంసిట్ అధికారులు ఇతర అంశాలపై దృష్టి పెట్టారు. పూరి బ్యాంకాక్ పర్యటనలపై సిట్ వివరాలు సేకరించింది. బ్యాంకాక్‌లో పూరి ఏఏ పబ్‌లకు వెళ్లారు.. బీచ్‌ల్లో ఎవరిని కలిశారనే అంశాలపై వీడియోల సేకరించే పనిలో సిట్ బ‌ృందం ఉన్నట్లు సమాచారం. పూరీ విదేశాల్లో పర్యటించే సమయంలో ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తులతో పరిచయం ఏర్పడిందా.. లేక ఇక్కడే ఎవరైనా పూరీకి పరిచయమయ్యారా అన్న కోణంలో కేసు దర్యాప్తు సాగుతోంది.పూరీ జగన్నాధ్‌కు బీచ్‌లంటే చాలా ఇష్టం. ఆయన తెరకెక్కించే ప్రతీ సినిమాలో బీచ్‌లో ఒక సీనోసాంగో ఉంటుంది. బ్యాంకాక్ ఎందుకెళతారని పలుమార్లు అడిగిన సందర్భంలో తన కథలను అక్కడే రాసుకుంటానని ఆయన సమాధానమిచ్చేవారు. గోవా బీచ్‌కు కూడా పూరీ తరచూ వెళ్తుండేవాడు. ఆ సమయంలోనే పూరీకి టాటూలు డ్రగ్స్ అలవాటు అయ్యి ఉండొచ్చని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

(86)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ