WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నంద్యాల' 'షాక్‌' ఎవరికి...?

త్వరలో జరగనున్న 'నంద్యాల' ఉప ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారా..? అని కేంద్ర,రాష్ట్ర నిఘా సంస్థలతో పాటు మీడియా సంస్థలు, కొన్ని ప్రైవేట్‌ సంస్థలు సర్వే నిర్వహించాయి. ఇప్పటికిప్పుడు పోలింగ్‌ జరిగితే 'జగన్‌' పార్టీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని వారి సర్వేలో వెల్లడైంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం,మైనార్టీలు, క్రైస్తవ ఓటర్లు,రెడ్డి సామాజికవర్గ ఓటర్లల్లో 90శాతంపైగా అధికారపార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉందని ఆ సర్వేల సారాంశమట. ఈ విషయం 'చంద్రబాబు' 'జగన్‌'కు కూడా తెలుసు. గెలుపుపై 'జగన్‌' ధీమాతో కనిపిస్తుండగా...ఎలా తన అభ్యర్థిని గెలిపించుకోవాలో...అన్ని మార్గాలను 'చంద్రబాబు' అన్వేషిస్తున్నారు. 'రంజాన్‌తోఫా'ను ముస్లింలకు అందించినప్పటికీ అధికారపార్టీ వైపు వారు మొగ్గుచూపుతున్నట్లు కనిపించడం లేదు.మాజీ మంత్రి ఫరూక్‌కు ఎమ్మెల్సీ ఇచ్చినా..అది మైనార్టీలపై పెద్దగా ప్రభావం చూపించలేదు. ఒక దశలో 'ఫరూక్‌' కూడా 'జగన్‌' పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆయనను 'బాబు' ఏ విధంగా బుజ్జగించారో తెలియదు కానీ...'ఫరూక్‌' తరువాత మెత్తబడ్డారు. 

  రెడ్డి ఓటర్లను ఆకర్షించే నాయకులు టిడిపిలో లేకపోవడం..టిడిపికి బాగా ఇబ్బంది కల్గిస్తుంది. నంద్యాల ఎంపి ఎ.పి.వై.రెడ్డి 'జగన్‌' పార్టీలో విజయం సాధించి టిడిపిలో చేరినా...ఆయన బంధువులుకానీ, క్రిందిస్థాయి నాయకులు కానీ ఆయనను అనుసరించడం లేదు. దీంతో 'రెడ్డి' సామాజికఓటర్లల్లో చీలిక ప్రభావం అంతంత మాత్రమేనని అధికారపార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. కానీ రాజకీయచాణిక్యుడిగా పేరున్న చంద్రబాబు ఆఖరి నిమిషంలో ఏదో చేస్తారని టిడిపి నాయకులకు నమ్మకం ఉంది. ఉప ఎన్నికల్లో అధికార పార్టీని గెలిపించడంలో 'చంద్రబాబు'కు ఉన్న అనుభవాన్ని దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డే అడ్డుకట్టవేయలేకపోయారు. తండ్రికి చేత కానిది 'జగన్‌'కు చేత అవుతుందా...? ఇప్పటికిప్పుడు మొగ్గు 'జగన్‌' వైపే ఉందని టిడిపి ముఖ్యులు, మంత్రులు మీడియా వర్గాలతో ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నారు. పోలింగ్‌ తేదీ నాటికి పరిస్థితులు ఏ విధంగా మారతాయనేది ఏ ఒక్కరూ చెప్పలేకపోతున్నారు. నియోజకవర్గంలో వంద కోట్లు పైగా ఖర్చు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఓటర్లు ప్రలోభాలకు దాసోహం అంటరా...? రంజాన్‌ తోఫాలు పనిచేస్తాయా..? వేచి చూడాల్సిందే...!

(317)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ