లేటెస్ట్

మాజీ ఎంపీకి వలేస్తోన్న 'రామ్‌మాధవ్‌'....!

ఎన్నికల్లో ఘోరపరాజయం పాలయిన టిడిపిని అడ్రసు లేకుండా చేయాలనే లక్ష్యంతో బిజెపి పెద్దలు పావులు కదుపు తున్నా వారికి ఆశించిన స్థాయిలో వలసలు కనిపించడం లేదు. దీంతో...పలువురు టిడిపి సీనియర్‌ నాయకుల ఇంటికి వెళ్లి తమ పార్టీలో చేరాలని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత 'రామ్‌మాధవ్‌' కోరుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇంటికి వెళ్లిన 'రామ్‌మాధవ్‌' తాజాగా...కోస్తా జిల్లాల్లో ప్రముఖ నేత ఇంటికి  వెళ్లి ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించారు. 'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన ఈ నేతను తమవైపు తిప్పుకుంటే, రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాల్లో తాము బలపడతామనే ఆలోచనతో...'రామ్‌మాధవ్‌' ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. తమ పార్టీలోకి వస్తే...అన్ని రకాలుగా సహకరిస్తామని, కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని చెప్పినట్లు సమాచారం. 

స్వతాహాగా కాంట్రాక్టర్‌ అయిన  మాజీ ఎంపి 'రామ్‌మాధవ్‌' మాటలకు స్పందించలేదని, మర్యాదపూర్వక భేటీ అని మాత్రమే ఆయన చెబుతున్నారు. టిడిపిని వీడి బిజెపిలో చేరితే...పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆమోదిస్తారా..? నామ మాత్రమైన a పార్టీలో చేరడం వల్ల ప్రస్తుతానికి ఉపయోగం ఉంటుందే కానీ...భవిష్యత్‌లో ఉపయోగం ఉండదనే భావనతో సదరు ఎంపీ ఉన్నారని తెలుస్తోంది. రాజకీయాల్లో ఎన్నో డక్కీమక్కీలు తిన్న మాజీ ఎంపి ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, మర్యాదపూర్వక భేటీలో ఆయనతో కలసి భోజనం చేసి...రామ్‌మాధవ్‌ను సాగనంపారని సమాచారం. మొత్తం మీద...టిడిపికి చెందిన మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టిన 'రామ్‌మాధవ్‌' మరి కొందరు మాజీ ఎంపీలను కలిసే పనిలో బిజీగా ఉన్నారు. 

(320)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ