WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అసహనంతో ఊగిపోతున్న 'జగన్‌,కెసిఆర్‌'లు...!

ఏమి చేయలేని నిస్సహాయతతోనే కోపం,ఆందోళన,ఉద్రేకం,చిరాకు తన్నుకు వస్తాయంటారు మానసిక విశ్లేషకులు..! తాము అనుకున్న పనులు కాని సందర్భంలో...ఈ అహనం కొందరి వ్యక్తుల్లో దానంతట అదే తన్నుకువస్తుంది. అది పబ్లిక్‌ప్లేసా...? లేక ప్రైవేట్‌ ప్లేసా..? లేక ఇంకేదైనా చోటా...అనేదేమీ ఉండదు...! తీవ్రమైన వ్యక్తిత్వ లోపాలు ఉన్న వ్యక్తుల్లో ఇది బయటకు వస్తుంది. ప్రస్తుతం ఇద్దరు ప్రముఖ రాజకీయనాయకులు దీని బారినపడి తెలుగురాష్ట్రాల ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారు. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనాయకుడు వై.ఎస్‌.జగన్‌ కాగా మరొక వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. గత రెండు రోజుల్లో వీరి ప్రవర్తన రెండు రాష్ట్రాల ప్రజల్లోనూ,రాజకీయనాయకుల్లోనూ, అధికారగణాల్లోనూ చర్చనీయాంశమైంది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులపై నోరుపారేసుకున్నారు. ఒకానొక సందర్భంలో 'ఆ నాకొడు' అంటూ రెచ్చిపోయారు. విద్యుత్‌ ఉద్యోగుల రెగ్యులైజేషన్‌ జిఓను ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడమే ఆయన అసహనానికి, ఉక్రోషానికి, కోపానికి, చిరాకుకు ప్రధాన కారణం. తాను ప్రజలకు మేలు చేస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు అడ్డుపడుతున్నారని ఆయన వారిని తనదైన శైలిలో నిందించారు...శంపించారు..! వాస్తవానికి ఆయన ప్రభుత్వం చేసే పనులు చిత్తశుద్దితో చేస్తే కాంగ్రెస్‌ కానీ మరే ఇతర పార్టీలు కానీ అడ్డుకున్నా ఆగేవి కావు. ఆయన కేవలం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికే ప్రయత్నిస్తూ తిరిగి నెపాన్ని ఇతరులపై రుద్దుతున్నారు. విద్యుత్‌ ఉద్యోగుల విషయమే తీసుకుందాం...హడావుడిగా ఇప్పటి వరకు విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటున్నామని జిఓ ఎలా ఇచ్చారు. దానికి ప్రాతిపదిక ఏమిటి..? సరైన ప్రతిపాదనలు చేయకుండా 'లేడికి లేచిందే పరుగన్నట్లు' వెళితే ఎదురు దెబ్బలు తినక ఏమవుతుంది. తన వైపు తప్పులు పెట్టుకుని...పక్కవారిపై పడడం ఏమిటి...? మొదటి నుంచి కెసిఆర్‌ తత్వమే అంత...! మేలు జరిగితే తాను చేసినట్లు...కీడు జరిగితే ఆంధ్రా వాళ్లు చేసినట్లు...? అందుకే మళ్లీ పాత కెసిఆర్‌ను చూస్తారని హుంకరింపులు...! చేతకాని తనం వల్లే ఇటువంటి మాటలు వస్తాయి...!

   ఇక ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌ వ్యవహారానికి వద్దాం. ఒకవైపు పుట్టెడు కేసులు పెట్టుకుని ఈరోజో...రేపో మళ్లీ ఊచలు లెక్కించే పరిస్థితి ఉంటే పాపం..ఆయనేం చేస్తారు..! ఆయనకు ఆందోళన,బిపి, అసహనం,ఉద్రేకం, చిరాకు రాకుండా ఎలా ఉంటాయి. జీవితాశయమైన ముఖ్యమంత్రి పదవి మరోసారి దూరమవుతుందేమోనన్న ఆందళోనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబును నడిబజారులో కాల్చినా తప్పులేదంటూ హంతక మాటలు మాట్లాడుతున్నారు. ఆయన వ్యవహారమే అంత...? తాను కోరుకున్నది దక్కనప్పుడు...గతంలో ఆయన ఏం చేశారో...మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య వివరంగా చెప్పారు. తాను కోరుకున్నది దక్కలేదన్న కసితో తండ్రి అనే కనికరం కూడా లేకుండా అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డినే ఆయన తూలనాడారు..ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయనకో లెక్కా...? అసలే మెతక ముఖ్యమంత్రి...గతంలో 'అనంతపురం' యాత్రలో చంద్రబాబును చీపుర్లతో కొట్టాలని ఆయన అన్నా పట్టించుకోని ముఖ్యమంత్రిని ఇప్పుడు కాల్చి చంపుతాననక మరేమంటారు...? ఆయన రేపు ఏదో గ్రహచారం వల్ల ముఖ్యమంత్రి అయితే తన మాట వినని, తనకు ఎదురు చెప్పే ప్రతివారిని కాల్చుకుంటూ పోవడమే...మరేం చేస్తాం..ఫ్రస్టేషన్‌...మరి అది...! తాను దైవాంశ సంభూతుడు కదా...! ఫ్రస్టేషన్‌లో ఏమి చేస్తారో ఎవరికెరుక...! అందుకే ఆయనతో జాగ్రత్తగా ఉండడండి...మరి..!

(298)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ