WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఉద్యోగుల్లో తొలగని భయాందోళనలు...!

మూడు రోజుల కిందట ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వ్యవహారంలో జరిగిన సంఘటనలు, పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన పాలకులు అటువంటి వందతులు నమ్మవద్దని ఉద్యోగుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వారి సహాయ,సహకారాలతోనే తాము అధికారంలోకి వచ్చామని, దీనిపై ఎటువంటి అనుమానాలు వద్దని సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరించారే బాహాటంగా చెప్పకపోవడంతో ఇంకా ఎక్కడో ఏదో జరుగబోతుందన్న అనుమానాలు ఉద్యోగ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇదే విషయంపై సచివాలయంలో 'జనం ప్రత్యేక ప్రతినిధి' పలువురు ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నాయకులు మాట్లాడుతూ కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత పెంచేందుకు ఒక పథకం ప్రకారం కుట్ర చేశారని వారు ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదం తీసుకోలేదు...సంబంధించిన ఫైల్‌ ముఖ్యమంత్రి ద్వారా మంత్రివర్గానికి నివేదించలేదు. ముందుగానే ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించిన కాపీలను బయటకు చేరవేసిన వ్యక్తులపై విజిలెన్స్‌ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే దీనిపై ఒక కింది స్థాయి అధికారి దొంగచాటుగా అందుకు సంబంధించిన కాపీలను తీసుకుని 'సాక్షి' పత్రికకు అందజేశారనే ప్రచారం జరుగుతోంది. సచివాలయంలో 'చంద్రబాబు' అభిమానులైన ఉద్యోగులు, అధికారులు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నా 'జగన్‌'పై వ్యతిరేక వ్యాఖ్యలు, ఆరోపణలు చేయరు. కానీ 'జగన్‌' అభిమానులైన కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులు 'చంద్రబాబు'ను వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలతో పాటు అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని ఇదంతా తమ సమక్షంలోనే జరుగుతుందని వారు చెబుతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సమయంలో కూడా జరగలేదని, ఫిరాయింపు ఎమ్మెల్యేలు,మంత్రులకు సన్నిహితంగా మెలుగుతున్న కొందరు క్రిందిస్థాయి అధికారులు పథకం ప్రకారం 'చంద్రబాబు'కు వ్యతిరేక ప్రచారం ప్రారంభించారని ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. 

  ముఖ్యంగా ఈ విషయంలో పదిమంది క్రిందిస్థాయి ఉద్యోగులు తెరవెనుక...తెరముందుకు వచ్చి కీలకపాత్ర పోషిస్తున్నారని వారు చెబుతున్నారు. అంతే కాకుండా ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వ్యవహారానికి సంబంధించిన ఫైల్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టారే తప్ప, దాన్ని తిరస్కరిస్తున్నామని కానీ, ఆ ప్రతిపాదనలను పూర్తిగా మూసివేస్తున్నామని కానీ సంబందిత అధికారులెవరూ పెదవి విప్పడం లేదని వీరు ప్రచారం చేస్తున్నారు. దీనిని బట్టి ఆ ప్రతిపాదన పక్కన పెట్టారే తప్ప దాన్ని పూర్తిగా పక్కనపెట్టలేదని మళ్లీ దాన్ని తెరపైకి తెస్తారని కూడా వీరు ప్రచారం చేస్తున్నారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి సంఘటనలు జరగలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబును 'జగన్‌' అభిమానులు ఖాతరు చేయరు. వారికి ఎటువంటి భయాలు ఉండవు..! ఒకవేళ ఉద్యోగం నుండి తొలగిస్తే 'జగన్‌' పార్టీలో చేరి 'చంద్రబాబు'ను రాజకీయంగా ఎదుర్కొంటామని చెబుతున్నారట. ఉగ్రవాదులు, తీవ్రవాదులు కూడా ఇటువంటి విమర్శలు, ఆరోపణలను బాహాటంగా వ్యక్తం చేసి ఉండరు. సచివాలయంలో సమాంతర పరిపాలన జరుగుతుంటే మంత్రుల కార్యాలయాల్లో 'జగన్‌' అభిమానులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. చివరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు కూడా 'జగన్‌'కు మద్దతు ఇస్తుంటే పాలకుల అసమర్థత బయటపడుతుంది. రెండేళ్లకు జరగనున్న ఎన్నికల లోపే ఉద్యోగవర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను పెంపొందించేందుకు జరిగిన కుట్రను సకాలంలో కనిపెట్టడంలో ఇంటిలిజెన్స్‌ వర్గాలు ఘోరంగా విఫలమయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికీ ఉద్యోగుల్లో వ్యక్తం అవుతున్న భయాందోళనలను తొలగించాలంటే 'చంద్రబాబు' మండలస్థాయి నుండి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు బాహాటంగా వెల్లడిస్తేనే తప్ప అనుమానాలు, సందేహాలు ఉద్యోగవర్గాల్లో తొలగిపోవు. విఫలమౌతున్న సమాచారశాఖను ప్రక్షాళన చేయాల్సిన తరుణం ఆసన్నమైందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అదే విధంగా మౌనంగా ప్రేక్షకపాత్ర పోషిస్తున్న ఇంటిలిజెన్స్‌లో పనిచేస్తున్న వివిధ హోదాల్లో పనిచేస్తున్న సీనియర్‌ అధికారులను తొలగించి ఆ స్థానంలో పాలకులకు విధేయులైన అధికారులను నియమించాలని వారు కోరుతున్నారు. ఒక వేళ ముఖ్యమంత్రి దీనిపై దృష్టిపెట్టకుండా ఉంటే ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది.

(204)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ