WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఉద్యోగుల పనితీరుకు కొలమానం ఏమిటి 'శ్రీకాంత్‌' గారూ...!?

ఉద్యోగుల పనితీరును బట్టి పోస్టింగ్‌లు, బదిలీలు చేస్తానే తప్ప...ఎటువంటి సిఫార్సులకు అంగీకరించే ప్రసక్తేలేదని చెపుబుతున్నారట జిఎడి పొలిటికల్‌ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌. పనితీరుకు కొలమానం ఏమిటి...? ఏ అధికారి, ఏ ఉద్యోగి ఏయేశాఖల్లో పనిచేసిన వారి పనితీరుపై ఎవరు నివేదికలు అందజేయాలి. ఆయా నివేదిక అందజేయటంలో పారదర్శకత ఉంటుందా...? ఆశ్రితపక్షపాతం, ధనప్రభావం పనిచేస్తే పరిస్థితి ఏమిటి...? దీనిపై ఏ ఒక్కరూ సమాధానం చెప్పడంలేదు. ఇటీవల కొందరు క్రింది స్థాయి అధికారులు సచివాలయంలో జిఎడి పొలిటికల్‌ కార్యదర్శిగా పనిచేస్తోన్న 'శ్రీకాంత్‌'ను స్వయంగా కలిసి తమను ఫలానా శాఖకు బదిలీ చేయాలని కోరడం జరిగింది. ఆ అధికారి పేరు తెలుసుకున్న 'శ్రీకాంత్‌' కంప్యూటర్‌లో ఆ అధికారి వివరాలను పరిశీలించిన ఆయన నీ పనితీరు సక్రమంగా లేదు...నిన్ను బదిలీ చేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారట. అంతకు ముందు తమ పనితీరును ఏ విధంగా కొలమానం చేశారో ఈ అధికారులకు అంతు బట్టడం లేదు. ఒక్కొక్కశాఖలో ఒక్కోరీతిలో పని ఉంటుంది. ఉదాహరణకు సర్వీసులు మరియు విజిలెన్స్‌ శాఖలో వందలాది ఫైళ్లు వస్తుంటాయి...పోతుంటాయి..! మిగతా సెక్షన్‌ల్లో పనితీరు తక్కువగా ఉంటుంది...సచివాలయంలో పలుశాఖల్లో ఈ పరిస్థితి స్పష్టంగా తెలుసుకోవచ్చు. సర్వీసులు మరియు విజిలెన్స్‌ శాఖల్లో పనిచేసే అధికారులకు మిగతా శాఖల్లో పనిచేసే ఉద్యోగుల పనితీరుకు ఎంతో భిన్నంగా ఉంటుంది. సీనియార్టీ ప్రకారం ఉద్యోగులకు, అధికారులకు ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 

   ఆయా ప్రమోషన్లు ఇచ్చే ముందు వివిధ సెక్షన్లలో పనిచేసే ఉద్యోగల పనితీరును ఎలా మదింపు చేస్తారు..? దివంగత ఎన్టీఆర్‌ హయాంలో పనితీరుకు కొంత శాతం రిజర్వేషన్‌ కల్పించారు. వాటినే మెరిట్‌ప్రమోషన్లగా పిలిచేవారు. ఉదాహరణకు ప్రమోషన్‌ల్లో నెంబర్‌1,2,3 స్థానాల్లో ఉండేవారికి ప్రమోషన్లు ఇవ్వకుండా 70,80,90స్థానాల్లో ఉండేవారికి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. దీంతో అనేక మంది ఉద్యోగులు, అధికారులు అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిందో రాలేదో తెలియదు కానీ ఎన్టీఆర్‌ అధికారం కోల్పోయాక ముఖ్యమంత్రి అయిన 'చెన్నారెడ్డి' వాటిని రద్దు చేయటంతో వాటి ప్రస్తావన ముగిసిపోయింది. 25ఏళ్లల్లో మళ్లీ ఆ ప్రస్తావన తెరపైకి రాలేదు. తాజాగా మళ్లీ ఆ విధానం తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరిగాయి. కానీ అసలు విషయం బయటకు పొక్కడంతో పోస్టింగ్‌లు, బదిలీలు పనితీరు ఆదారంగానే చేస్తామని అధికారులు చెబుతున్నారు. మంత్రివర్గ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరిగే ముందు కొంత మంది అధికారులు, ఉద్యోగులు రాత్రిళ్లు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ విభాగాల్లో ఈ విధమైన సంఘటనలు జరిగినా దానిని వారి పనితీరుగా ఇంతకు ముందెన్నడూ పరిగణించలేదు. భవిష్యత్‌లో శ్రీకాంత్‌ ఆ విధంగా ప్రకటిస్తారేమో? ఉద్యోగుల పనితీరును బట్టి కాకుండా, సీనియార్టీని బట్టి ప్రమోషన్లు ఇవ్వాలని ఇప్పటికే తమ కన్నా ఎన్నో సంవత్సరాలు జూనియర్లు అయిన ఎస్‌సి,ఎస్‌టి ఉద్యోగలు, అధికారులు ప్రమోషన్ల కోటాలో ముందుకెళ్లారని ఇంకా తమను ఈ విధంగా కూడా పనిచేయనివ్వరా అని వారు అంటున్నారు.

(164)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ