WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రులపై 'రోజా' లైంగిక ఆరోపణలు...!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులుపై నగరి ఎమ్మెల్యే 'రోజా' సంచలన ఆరోపణలు చేశారు. ఇద్దరు మంత్రులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె మీడియా సమావేశంలో ఆరోపించారు. ఇద్దరు మంత్రులను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలకు రాఖీ శుభాకాంక్షలు చెప్పే నైతిక హక్కు లేదని ఆమె అన్నారు. ఒక మహిళా ఐఎఎస్‌ అధికారిని మంత్రులు లైంగికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆ మహిళా ఐఎఎస్‌ అధికారి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా ఆయన స్పందించలేదని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. మంత్రి అఖిలప్రియ వస్త్రధారణపై తాను చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందన సరికాదని వ్యాఖ్యానించారు. మంత్రివర్గ సమావేశానికి చీర కట్టుకుని వెళ్లమని తాను సూచించానని, దీనిలో తప్పేముందని ఆమె అన్నారు. ఒక వేళ తన సూచన నచ్చకపోతే నైటిలో మంత్రివర్గ సమావేశానికి ఆమె వెళ్లవచ్చని, దీనికి తానేమీ అభ్యంతరం చెప్పనని ఆమె వ్యాఖ్యానించారు. 'పవన్‌కళ్యాణ్‌' నేతన్నల సమావేశానికి ఒక రోజు వచ్చి వెంటనే వెళ్లిపోయారని, ఆయన 'పవర్‌స్టార్‌ కాదని...ఆమె ఆరోపించారు. మొత్తం మీద మొన్న నంద్యాలలో ఆమె మంత్రి అఖిలప్రియ వస్త్రధారణపై చేసిన ఆరోపణలపై నిరసనలు వ్యక్తం అవుతున్నా...'రోజా' మాత్రం తన నోటికి పనిచెప్పడం మానడం లేదు. చుడీధార్‌ ధరించిన వాళ్లంతా మగవాళ్లేనని వ్యాఖ్యానించిన ఆమె ఈ రోజు మంత్రిని 'నైటీ'లో మంత్రివర్గ సమావేశానికి వెళ్లమని వ్యాఖ్యానించి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


(263)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ