WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రుల‌పై 'రోజా' లైంగిక వేధింపుల ఆరోపణల‌న్నీ అభూతకల్పనలే...!?

ఒక సీనియర్‌ మహిళా ఐఎఎస్‌ అధికారిణిని మంత్రులు వేధింపులకు గురిచేశారని వైకాపా ఎమ్మెల్యే రోజా చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని, ఇవన్నీ అభూత కల్పనలని మీడియా వర్గాలు సేకరించిన సమాచారంలో వెల్లడైంది. మూడు నెలలకు ముందు ఆ మహిళా అధికారి ఆ శాఖకు సంబంధిన పైళ్ల వ్యవహారంలో మంత్రి వ్యవహరిస్తున్న తీరుపై సిఎంఒ అధికారులకు, ఇతర ముఖ్యులకు ఫిర్యాదు చేసింది. ఆ సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ఏ ఒక్కరితో సన్నిహితంగా ఉండేది కాదు. సహచర అధికారులతోనే ఆమె ఆప్యాయంగా మాట్లాడరు. ఆ అధికారిని లైంగికంగా వేధించే వయస్సు ఆమెది కాదు. 'రోజా' ఆరోపించిన మంత్రులు కూడా ఆ విధమైన మనస్తత్వం ఉన్నవారు కాదు. ఇదే విషయంపై కొందరు ముఖ్యులను మీడియా వర్గాలు కలసి ఆ మహిళా అధికారి ఫిర్యాదుపై ప్రశ్నించగా 'అది కట్టుకథ...! శాఖకు సంబంధించిన వ్యవహారలపై ఆమె ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని, లైంగిక వేధింపుల మాట పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు. ఒక మహిళా ఎమ్మెల్యే ఈ విధంగా బరితెగించి మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులంటూ ప్రచారానికి దిగడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. 

  మంత్రులపై కోపం ఉంటే వారిని రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎదుర్కోవాలే తప్ప...మహిళా అధికారిణి అడ్డుపెట్టుకోవడం 'రోజా'కు తగదని వారు అంటున్నారు. దీనిపై సంబంధిత మంత్రులు ఆమె పరువు నష్టం దావా వేస్తే ఆమె జైలుకు వెళ్లడం ఖాయమని అధికారులు చెబుతున్నారు. రాజకీయ నాయకులు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేయటం సర్వసాధారం. కానీ అధికార వ్యవస్థను వివాదంలోకి లాగడం ఆమెకు తగదని వారు చెబుతున్నారు. 'రోజా' చేసిన ఆరోపణలపై మంత్రులు సీరియస్‌గా స్పందిస్తే వారికి ఇక్కట్లు తప్పవు. అంతే కాకుండా మంత్రి అఖిలప్రియ వస్త్రధారణపై 'రోజా' విమర్శలు చేయటంపై రాజకీయ,అధికార, మహిళా వర్గాలు తప్పుపడుతున్నాయి. వస్త్రధారణపై 'రోజా' వ్యాఖ్యలు చేయటం ఏమిటి...? ఆమె సినిమాల్లో ఎటువంటి దుస్తులు వేసుకున్నారు...జబర్ధస్త్‌లో ఆమె చేసే వ్యాఖ్యానాలు, ఆమె హావభావాలు ఎలా ఉన్నాయో తెలుగు ప్రజలందరూ చూస్తున్నారని  అటువంటి ఆమె మంత్రిపై విమర్శలు చేయటం తగదని 'జగన్‌' పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఆఫ్‌ ది రికార్డుగా ఖండిస్తున్నారు. మహిళా అధికారిణిని, మంత్రి అఖిలప్రియపై 'రోజా' వ్యాఖ్యలు చేయటం తగదని వారు అంటున్నారు. మంత్రులపై ఆమె చేసిన ఆరోపణలకు ఆధారాలు లేకపోవడంతో ఆమెపై చర్య తీసుకోవాలని అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెంచుతున్నారు.

(210)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ