WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఫైళ్ల పరిష్కారంలో కొలబద్దమేటి...!?

సచివాలయంలో వివిధశాఖాధిపతులు,మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫైళ్ల పరిష్కారంపై తీసుకుంటున్న సమయంతో పాటు సంబంధించిన దస్త్రాలను ఎలా పరిష్కరిస్తున్నారూ...అన్న దానిపై కొందరు అధికారులు చర్చించుకుంటున్నారు. వేగంగా దస్త్రాలను పరిష్కరించడంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'దినేష్‌కుమార్‌' మొదటి స్థానంలో ఉండగా ఆయన బాటలోనే సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి 'ఆధిత్యనాథ్‌దాస్‌' కరికాలవళువన్‌', డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌, నీరబ్‌కుమార్‌ప్రసాద్‌ తదితరులు నడుస్తున్నారు. ఆర్థికశాఖాధిపతి  'రవిచంద్ర' దస్త్రాల పరిష్కారంలో అందరికన్నా ముందున్నారని వచ్చిన వార్తలపై ఆ శాఖకు చెందిన కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికశాఖలో వస్తున్న దస్త్రాలు ఎన్ని ఆయా పైళ్లల్లో ఎన్ని పరిష్కారం అవుతున్నాయి...ఎన్ని ఫైళ్లపై కొర్రీలు పడుతూ తిరిగి వెనక్కి వెళుతున్నాయి...అనే విషయంపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడుతుంది. ఈశాఖకు వచ్చే ఫైళ్లలో అతికొద్ది మాత్రమే పరిష్కారానికి నోచుకుంటున్నాయని, మిగతా ఫైళ్లపై కొర్రీలు పడుతుంటాయని సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. దస్త్రాలను పరిష్కరించారనే విషయంపై దృష్టిపెడితే ఏయే శాఖాధిపతి ఎన్ని ఫైళ్లను పరిష్కరించారో...ఎన్ని పైళ్లపై కొర్రీలు వేసి వెనక్కుపంపారో అనే విషయం అర్థం అవుతుంది. 

   ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'దినేష్‌కుమార్‌' మానవవనరులశాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌లు ఏరోజుకు ఆరోజు తమకు వచ్చిన ఫైళ్లను పరిష్కరించి పంపుతూనే ఉంటారు. కేవలం కొన్ని ఫైళ్లపై మరిన్ని వివరాలను మాత్రమే కోరతారు. అదే విధంగా తమకు వద్దకు వచ్చే దస్త్రాలను ఒకటి రెండు రోజుల్లో డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌, నీరబ్‌కుమార్‌లు పరిష్కరిస్తుంటారు. మున్సిపల్‌శాఖాధిపతి 'కరికాళవలవన్‌' కూడా అదే రీతిలో వ్యవహరిస్తుంటారు. వీరందరి కన్నా సూపర్‌స్పీడ్‌గా ఎక్సైజ్‌,కమర్షియల్‌టాక్స్‌ మరియు రిజిస్ట్రేషన్లశాఖాధిపతి డాక్టర్‌ సాంబశివరావు పరిష్కరిస్తుంటారు. సచివాలయంలో వివిధశాఖాధిపతుల్లో ఎప్పటికప్పుడు దస్త్రాలను పరిష్కరించడంలో 'సాంబశివరావు, ఆదిత్యనాథ్‌దాస్‌' ముందుంటారనేది వాస్తవం. ఇందులో 'ఆదిత్య' అనుకూల వైఖరితో ఫైళ్లను పరిష్కరిస్తారు. తమకు అన్యాయం జరిగిందని ఎవరైనా ఆయనను స్వయంగా కలసి వివరిస్తే అప్పటికప్పుడు ఆయా ఫైళ్లను తెప్పించి కింది వారు రాసిన వ్యాఖ్యలను పక్కనపెట్టి, వాస్తవాలతో కూడిన అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారనే దానిలో 'దాస్‌'ను మించిన అధికారి లేడని ఆ శాఖకు చెందిన ఉద్యోగులు చెబుతున్నారు. 'సాంబశివరావు' నిజాయితీపరుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నప్పటికి నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారే తప్ప లౌక్యం ప్రదర్శించరనే విమర్శ ఉంది. నిన్నటి వరకు ఫైళ్లపై వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారు..ఏ ఒక్కరినీ లెక్కచేయరు..అని విమర్శ ఉన్న సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి 'దినేష్‌కుమార్‌' ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వంద రోజుల అనంతరం ఆయనపై పూర్తిగా అనుకూలత వ్యక్తం అవుతుంది. గతంలో 'దినేష్‌కుమార్‌'పై దుప్రృచారం జరిగిందని అతి వాస్తవం కాదని కార్యాలయంలో ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారని, కలిసేందుకు ఎవరు వచ్చినా వారి సమస్యలను ఓపిగ్గా విని పరిష్కరిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇంతకు ముందు అనేక మంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు...వారిలో ఏ ఒక్కరూ 'దినేష్‌' వలే అందుబాటులో ఉండలేదు...అప్పట్లో సిఎస్‌ అంతరంగిక కార్యాలయ అధికారులపై ఆరోపణలు, విమర్శలు వచ్చేవి ప్రస్తుతం 'దినేష్‌కుమార్‌' కార్యాలయ సిబ్బందిపై ఎటువంటి ఆరోపణలు రావడం లేదనే పేరు తెచ్చుకున్నారు.

(197)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ