WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

యుద్ధ వాస్తవాలను వక్రీకరిస్తున్న మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం...!

వాస్తవాలకు,వక్రీకరణలకు ఒక హద్దుపద్దూ ఉంటుంది. ఘోరమైన పరాజయం తరువాత కూడా మేమే గెల్చాం...! అంటూ ప్రగల్బాలు పకలకడం హాస్యాస్పదం. 1962లో జరిగిన భారత్‌,చైనా యుద్ధంలో భారత్‌ గెలిచిందట. ఇదేదో నేను చెప్పే మాట కాదు..సాక్షాత్తూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తన విద్యార్థులకు  బోధిస్తోంది. సంస్కృతం విద్యార్థులకు ఈ విషయాన్న తన పుస్తకాల ద్వారా ప్రచారం చేస్తోంది. ఒక వైపు డోక్లాం వివాదంలో భారత్‌,చైనా సైనికులు ఎదురెదురు నిలిచిన పరిస్థితుల్లో ఈ పాఠం ఇప్పుడు చర్చనీయాంమవుతోంది. మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి భావిభారత పౌరులకు అసత్యాలను నూరిపోస్తోంది. భారత్‌పై ప్రేమ ఉండడం వేరు...వాస్తవాలు వేరు...!  1962లో నాటి భారత్‌ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నిర్వాకంతో భారత్‌ చైనాతో జరిగిన యుద్ధంలో భారత్‌ ఘోరంగా ఓడిపోయింది. ఈవిషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరూ అంగీకరించింది. నాటి యుద్ధంలో భారత్‌ దాదాపు 3400 మంది సైనికులను కోల్పోయింది. సైనికులకు కనీసం బూట్లు, తుపాకీలు లేని స్థితిలో వారిని యుద్ధ రంగంలో నిలిపి నెహ్రూ ఘోర తప్పిదం చేశారు.  అయితే నెహ్రూ తప్పులు ఎలా ఉన్నా... జరిగింది చరిత్ర...కానీ దానికి వక్రీరించి 'భారత్‌' ఆ యుద్ధంలో గెలించిదని భావి భారత పౌరులకు బోధించడంఏమిటి..? వాస్తవాలకు .. మసిపూసి మారేడు కాయచేయడం ఏమిటి...? జరిగింది వేరు... ప్రభుత్వం విద్యార్థులకు భోధించేది వేరు...! అసలు ఈ పుస్తక రచయితలు ఎవరు? దీనికి సంపాదకత్వం వహించిదెవరు...? సిబిసీఇ ముద్రించిన ఈ పుస్తకంలో వాస్తవాలు దాచి భావి భారత పౌరులకు అవాస్తవాలను ప్రచారం చేయటంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఎందుకు ఇటువంటి ప్రచారాలకు పూనుకుంటున్నారు. 

   ఒక వైపు డోక్లాం వివాదంతో నేడో రేపో అన్నట్లు యుద్ధ మేఘాలు ఆవరించిన సమయంలో ఇప్పుడు ఇటువంటి వక్రీకరణలు అవసరమా..? దేశాన్ని బలవంతంగా యుద్దం వైపు మళ్లిస్తున్న బిజెపి వర్గాలు ఇటువంటి వక్రీకరణలు మానుకుంటే మించిదేమో...ఇదెలా ఉందంటే 1948 సంవత్సరంలో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత 'దేశం'లోని అన్ని సంస్థానాలు భారత్‌లో విలీనం అవుతుంటే హైదరాబాద్‌ సంస్థానం తాము భారత్‌లో విలీనం కామని, స్వతంత్య్రంగా ఉంటామని ప్రకటించింది. అయితే దాన్ని భారత్‌లో విలీనం చేయాలని నాటి భారత్‌ హోంమంత్రి, ఉక్కుమనిషి బిరుదాంకితుడైన 'సర్దార్‌వల్లభాయ్‌పటేల్‌' హైదరాబాద్‌ సంస్థానంపై సైనిక చర్యకు ఆదేశించారు. హైదరాబాద్‌ సంస్థానంపై భారత్‌ సైన్యం దాడి మొదలు పెట్టడంతో నిజాంను సమర్థించే పత్రికలు యుద్ధం ఫలితాలపై వక్రీకరణలు మొదలు పెట్టాయి. నాటి వక్రీకరణలు ఎలా ఉన్నాయంటే భారత్‌ సైన్యంపై నిజాం సైన్యం దాడి చేసి వారిని పారద్రోలిందట...! నిజాం సైన్యం దెబ్బకు భారత్‌ సైన్యం తోకముడిచిందట. నాటి పత్రికల పైత్యం ఇది. వాస్తవానికి భారత్‌ సైన్యం హైదరాబాద్‌ విమానాశ్రయంలో దిగడంతోనే హైదరాబాద్‌ ప్రజలకు సైన్యానికి జేజేలు పలుకుతూ వారిని వెంట నడిచారు. పైగా భారత్‌ సైన్యానికి ఎదురు నిలిచే సాహసం నిజాం సైన్యం చేయలేదు. ఇది వాస్తం కాగా. నాటి పత్రికలు చేసిన ప్రచారం ఏమిటంటే భారత్‌ యుద్దవిమానాలను నిజాం సైన్యం కూల్చివేసిందట. అంతే కాదు..నిజాం సైన్యం దెబ్బకు భారత్‌ సైన్యం కుదేలైపోయిందట. ఇవి నాటి వక్రీకరణలు...! వాస్తవానికి భారత్‌ సైన్యం సైనిక చర్య చేపట్టడంతోనే నిజాం సైన్యం నలు దిక్కులా పారిపోయింది. సైన్యానికి ఎదురేలేదు..నిజాం సైన్యం కనీసం ఎదిరించే సాహసం కూడా చేయలేదు..ఇవి వాస్తవాలు....కానీ నాటి పత్రికల వక్రీరణకలు పై విధంగ ఉన్నాయి...ఇప్పుడు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ విద్యాశాఖ వక్రీకరణలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఏమి చేస్తాం...అంతా 'మోడీ' మహిమ..లేనిది ఉన్నట్లు చూపడమే కదా...'మోడీ' స్టైల్‌...!

(206)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ