WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పంజాబ్‌' సద్దిరోటీలు...'లోటస్‌పాండ్‌'లో తేలాయట...!

ఎక్కడుంటే తగిలించుకున్నావురా...అంటే...వంకెన ఉంటే తగిలించుకున్నాను...అన్నట్లుంది...వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌ పరిస్థితి. రూ250 కోట్ల రూపాయలు ఇచ్చి సలహాలు ఇస్తాడనుకుని తీసుకువచ్చిన 'ప్రశాంత్‌ కిశోర్‌' పనితీరుకు బెంబేలు ఎత్తిపోతున్నారట వై.ఎస్‌.జగన్‌. తనకు రాజకీయంగా మైలేజ్‌ తెచ్చే పనులు చేయమంటే 'పికె' చేసే పనులు 'జగన్‌'కు తలబొప్పి కట్టిస్తున్నాయట. రాజకీయ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాలు అమలు చేయటంలో నిష్టాతుడైన 'పికె' తాజాగా అనుసరించిన వ్యూహాలు బెడిసికొట్టాయట. సోషల్‌మీడియాలో ఆయన 'జగన్‌'కు మద్దతుగా చేస్తున్న ప్రచారం వికటించిందట. ఈ విషయాన్ని స్వయంగా 'జగన్‌'కు అనుకూలంగా ఉన్న వెబ్‌సైట్లే ప్రచురిస్తున్నాయి. సోషల్‌మీడియాలో 'జగన్‌' ప్రత్యర్థి అయిన 'చంద్రబాబు'పై ఆయన నిర్వహిస్తున్న ప్రచారాన్ని చూసి వారు కూడా అవాక్కు అవుతున్నారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో 'చంద్రబాబు'ను విమర్శిస్తూ, 'జగన్‌'ను సమర్థిస్తూ 'పికె' చేయిస్తున్న ప్రచారం ఫేక్‌ అని అందరికీ తెలిసిపోయిందట. పంజాబ్‌కు చెందిన వారి పేర్లతో ఆయన నిర్వహిస్తున్న ప్రచారాన్ని టిడిపి సోషల్‌ మీడియా విభాగం ఇప్పుడు ఎండగడుతూ విమర్శలు గుప్పిస్తోంది. గత పంజాబ్‌ ఎన్నికల సందర్భంగా 'పికె' సోషల్‌మీడియాలో నిర్వహించిన ఎకౌంట్ల ద్వారానే మళ్లీ 'చంద్రబాబు'పై ప్రచారం చేస్తున్నారట. అయితే ఈ ఎకౌంట్‌లలోని పేర్లు అన్నీ పంజాబ్‌,ఢిల్లీకి చెందిన వ్యక్తులవట. ఉదాహరణకు ఒక ఎకౌంట్‌ పేరు 'కౌర్‌' అట...! 'కౌర్‌' అంటే ఎవరికి తెలుసు..ఈమెకు ఆంధ్రా గురించి ఏమి తెలుసని వారు విమర్శిస్తున్నారు. ఎప్పుడో పంజాబ్‌లో చేసిన ప్రచారాన్ని ఇప్పుడు 'జగన్‌'కు అంటగడుతున్నాడట పికె. దీని వల్ల ఆయనకు వచ్చే మైలేజ్‌ ఏముందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. వందలకోట్లు పోసి సలహాలు ఇస్తాడని, తమకు అధికారంలో కూర్చోబెడతారని భావించిన 'లోటస్‌పాండ్‌' వ్యూహకర్తలు ఇప్పుడు ఇదేంటప్పా ఇలా జరుగుతోందని వాపోతున్నారట. పంజాబ్‌ సద్ది రోటీలు...ఆంధ్రాలో పనికిరావని,  కొద్దిగా 'పికె' చెప్పండని టిడిపి నాయకులు ఎకసెక్కాలాడుతున్నారు.

(220)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ