WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు'ను ఉరితీయండి...!

'నంద్యాల' ఉప ఎన్నిక సందర్భంగా వై.ఎస్‌.జగన్‌ వారం రోజుల కిందట చేసిన వ్యాఖ్యలపై దుమారం ఇంకా సద్దుమణగముందే ఆయన మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రిని 'ఉరి' తీయాలని ఆయన ఈ రోజు జరిగిన రోడ్‌షోలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఏమి చేయాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన వ్యక్తికి 'ఉరే' శిక్ష అని మరోసారి రెచ్చిపోయారు. వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదన్న 'జగన్‌' ఈ రోజు 'ఉరి' వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా 'జగన్‌' వ్యాఖ్యలపై మరోసారి టిడిపి నాయకులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. లక్ష కోట్లు దోచుకున్న దొంగను ముందు ఉరితీయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. వాగ్దానాలు నెరవేర్చకపోతే ఉరి తీస్తే..మరి లక్ష కోట్లను దోచుకున్న 'దొంగ'ను రాళ్లతో కొట్టి చంపాలని టిడిపి కార్యకర్తలు సానుభూతిపరులు డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తం మీద 'జగన్‌' చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. మాట్లాడితే ముఖ్యమంత్రి చంద్రబాబును చంపాలని, ఉరి వేయాలంటున్న ఆయన వ్యాఖ్యలపై సామాన్య 'జనం'లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. రాజకీయ విమర్శలు చేసుకోవడం సాధారణమని, కానీ చంపుడు భాషేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా 'జగన్‌' ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ పోతే 'నంద్యాల'లో పార్టీ గెలవడం కష్టమని స్వంత పార్టీ నేతలే అంటున్నారు.

(75)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ