WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కోడలి పై అత్తమామల దాడి

వినుకొండ : బొల్లాపల్లి మండలంలోని మూడు తూముల తండాకు చెందిన వడితే  కుమారి బాయి పై తన అత్తమామలు కోటానాయక్‌, బావ, తోడికోడళ్ళు కళ్యాణ్‌ నాయక్‌, బుజ్జిబాయిలు దాడిచేసి గాయపరిచినట్లు బాధితురాలు తెలిపింది. గాయాలపాలైన కుమారి బాయికి ఏడు సంవత్సరాల క్రితం కనుమలచెరువు తండాకు చెందిన నారాయణ నాయక్‌తో కట్నకానుకలు ఇచ్చి ఘనంగా పెళ్ళి చేశారని అయితే సంవత్సరం క్రితం భర్త అనారోగ్యంతో బాధపడుతూ మృత్యువాతకు గురికాగా ఆ సమయంలో పెద్దల సమక్షాన తన ఇద్దరు పిల్లలకు పెద్దలతో కలిసి తనకు రెండు లక్షల 30 వేలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకొని సమయం గడిచిపోతున్న నేపధ్యంలో అత్తమామలను ఒప్పందం ప్రకారం నగదు ఇవ్వాల్సిందిగా కోరగా, వారందరూ తమ పై దుర్భాషలాడుతూ దాడిచేయటంతో గాయాలపాలైన ఆమెను బంధువులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

(39)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ